బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్( Basavatharakam Hospital ) ఏపీలో కూడా స్థాపించబోతున్నట్లు ఎమ్మెల్యే బాలకృష్ణ తెలియజేశారు.ఈ హాస్పిటల్ కి మేనేజింగ్ ట్రస్ట్ అండ్ చైర్మన్ గా బాలకృష్ణ( Balakrishna ) ఉండటం తెలిసిందే.
హైదరాబాద్ లో ఉన్న ఈ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా విలువైన వైద్యం అందిస్తున్నారు.కాగా ఇప్పుడు ఈ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థాపించబోతున్నట్లు బాలకృష్ణ ప్రకటన చేయడం జరిగింది.
అమరావతిలో బసవతారకం హాస్పిటల్ నిర్మించేందుకు గతంలోనే సీఎం చంద్రబాబు స్థలాన్ని కేటాయించినట్లు స్పష్టం చేశారు.ఇప్పుడు ఆ స్థలంలోనే క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు.
ఈ హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే ఏపీ నుంచి హైదరాబాద్ కి వచ్చే రోగులకు ఉపశమనం కలుగుతుంది అని తెలియజేయడం జరిగింది.ఈ విషయాన్ని తాజాగా క్యాన్సర్ హాస్పిటల్ వార్షికోత్సవంలో బాలకృష్ణ తెలియజేయడం జరిగింది.క్యాన్సర్ ట్రీట్మెంట్ కి సంభందించి దేశంలోనే ఈ హాస్పిటల్ కి మంచి పేరు ఉంది.ఇప్పటివరకు దాదాపు రెండు లక్షల మందికి పైగా క్యాన్సర్ పేషెంట్లు ఉచితంగా వైద్య చికిత్సలు( Free medical treatments ) అందుకోవడం జరిగింది.
బాలకృష్ణ తల్లి బసవతారకం క్యాన్సర్ తో చనిపోవడం.అప్పటి రోజులలో క్యాన్సర్ చికిత్స అందుబాటులో లేకపోవడంతో తన తల్లిలా మరొకరికి జరగకూడదని ప్రజల కోసం ఆలోచించి బాలకృష్ణ ఈ హాస్పిటల్ నిర్మించారు.
ఇన్నాళ్లు హైదరాబాద్ లోనే సేవలు అందించిన ఈ హాస్పిటల్ ఇప్పుడు ఏపీలో కూడా.ప్రారంభం కాబోతోంది.