టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జున( Nagarjuna ) కెరీర్ పరంగా మళ్లీ బిజీ అవుతున్నారు.నాగ్ ప్రస్తుతం నటిస్తున్న కుబేర సినిమాపై మంచి అంచనాలు నెలకొనగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.
సిరివెన్నెల సీతారామశాస్త్రిని చూస్తే అసూయగా ఉండేదని నాగార్జున కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.సంగీతం కేవలం సినిమాలోనే కాదని లైఫ్ లో కూడా భాగమని నాగ్ అన్నారు.

మ్యూజిక్ ను ఆస్వాదించగలిగితే లైఫ్ లో ఒంటరితనం దరి చేరదని నాగ్ చెప్పుకొచ్చారు.సీతారామశాస్త్రిని చూస్తే అసూయగా అనిపించేదని సాహిత్యాన్ని అంత గొప్పగా ఎలా రాసేవారో అర్థమయ్యేది కాదని నాగ్ తెలిపారు.నాకు మ్యూజిక్ ఇష్టమని ఖాళీ సమయంలో మ్యూజిక్ వింటానని నాగ్ అన్నారు.నేను, శాస్త్రిగారు ఇండస్ట్రీకి ఒకే సమయంలో వచ్చామని ఆయన నన్ను హీరో అని పిలిచేవారని నాగ్ తెలిపారు.

నా రెండో సినిమా సంకీర్తనలో వే వేల వర్ణాల సాంగ్ ను ఆయన రాశారని నాగ్ చెప్పుకొచ్చారు.శాస్త్రిగారిని మొదటిసారి ఎప్పుడు కలిశానో గుర్తు లేదని ఆయన వెల్లడించారు.శివ సినిమా నాకు, శాస్త్రిగారికి స్పెషల్ అని ఈ సినిమాలోని పాటల కోసం ఆయనతో మాట్లాడానని నాగ్ పేర్కొన్నారు.సీతారామశాస్త్రి మాట్లాడుతుంటే చిన్నపిల్లాడు మాట్లాడుతున్నట్టు ఉంటుందని ఆయన తెలిపారు.
శివ సినిమా( Siva )లోని బోటనీ క్లాస్ పాటలో ఎంతో లోతైన అర్థం ఉందని నాగ్ చెప్పుకొచ్చారు.ప్రపంచంలో జరిగే విషయాలపై శాస్త్రిగారికి ఎంతో అవగాహన ఉందని నాగ్ చెప్పుకొచ్చారు.
తెలుసా మనసా సాంగ్ ను దగ్గర కూర్చుని రాయించుకున్నానని నాగ్ వెల్లడించారు.నాగ్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నాగార్జున కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ప్రశంసలతో పాటు విజయాలు అందుకుంటున్నారు.