కల్కి సినిమా( Kalki 2898 AD ) రిలీజ్ కు సమయం దగ్గర పడే కొద్దీ అభిమానులకు, మేకర్స్ కు టెన్షన్ అంతకంతకూ పెరుగుతోంది.ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మరిన్ని ప్రయోగాల దిశగా టాలీవుడ్ ఇండస్ట్రీ అడుగులు పడటం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే కల్కి సినిమాలో పాత్రల సృష్టి వెనుక కథ ఇదేనంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.వైరల్ అవుతున్న ఆ వార్తలు మూవీపై అంచనాలను పెంచుతున్నాయి.
![Telugu Kalki Ad, Kamal Haasan, Malavika, Prabhas, Shobana-Movie Telugu Kalki Ad, Kamal Haasan, Malavika, Prabhas, Shobana-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/06/Kalki-2898-AD-Prabhas-Kamal-Haasan-Malavika-Shobana-roles.jpg)
శ్రీ మహా విష్ణువు పదో అవతారం కల్కి ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.ఫిక్షనల్ కథాంశంతో 2898 ఏడీలో జరిగే కథగా ఈ సినిమా తెరకెక్కింది.మహా భారతంలోని అశ్వత్థామ పాత్ర ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది.కల్కి అవతార ఆవిర్భావానికి అశ్వత్థామ సహాయాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు.ప్రభాస్( Prabhas ) ఈ సినిమాలో భైరవ అనే బౌంటీ హంటర్ రోల్ లో కనిపించనున్నారు.భైరవుడు అంటే శివుడి అంశ అనే సంగతి తెలిసిందే.
![Telugu Kalki Ad, Kamal Haasan, Malavika, Prabhas, Shobana-Movie Telugu Kalki Ad, Kamal Haasan, Malavika, Prabhas, Shobana-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/06/Kalki-2898-AD-Prabhas-Kamal-Haasan-Shobana-roles.jpg)
అశ్వత్థామను సైతం ఎదుర్కొనే బలమైన పాత్రలో భైరవ కనిపించనున్నారు.కల్కిలో సుప్రీం యాస్కిన్ పాత్రలో కమల్( Kamal Haasan ) కనిపించనుండగా మనిషి ప్రాపంచిక సుఖాల కోసం వెంపర్లాడటం ఆపనంత వరకు కలి మనల్ని పట్టి పీడిస్తుందని ఈ పాత్ర చెబుతుంది.దీపిక ఈ సినిమాలో సుమతి పాత్రలో కనిపించనున్నారు.ఆమె కడుపున కల్కి పుడతాడని ప్రమోషన్స్ ద్వారా అర్థమవుతోంది.అభిమన్యుడి భార్య ఉత్తర పాత్రలో మాళవిక ఈ సినిమాలో కనిపించనున్నారు.అమితాబ్, మాళవిక మధ్య సీన్స్ ఉంటాయని ఉత్తర వల్లే అశ్వత్థామకు శాపం కలుగుతుందని తెలుస్తోంది.
శోభన ( Shobana )ఈ సినిమాలో శంబల మహిళ మరియంగా కనిపించనున్నారు.ప్రభాస్ ఇంటి యజమానిగా బ్రహ్మానందం కనిపించనున్నారు.
ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.కల్కి టికెట్ రేట్లు భారీ స్థాయిలో ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.