సంచలనం! స్ప్రింగ్ ఫెస్టివల్ రోబో డ్యాన్స్ రివల్యూషన్

రోబోలు ప్రస్తుతం మన జీవితాల్లో కీలకమైన భాగంగా మారిపోతున్నాయి.అయితే, చైనా మాత్రం రోబోటిక్స్‌ను(Robotics) కొత్త స్థాయికి తీసుకెళ్లింది.

 Sensation! Spring Festival Robot Dance Revolution, Robot Dance, Unitree H1, Chin-TeluguStop.com

ఇటీవల జరిగిన స్ప్రింగ్ ఫెస్టివల్ గాలాలో యూనిట్రీ H1 హ్యూమనాయిడ్ రోబోలు(H1 humanoid robots) మనుషులతో కలసి డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాయి.ఈ ఈవెంట్‌లో పదహారు యూనిట్రీ H1 రోబోలు ఒకేసారి సింక్రోనైజ్డ్ డ్యాన్స్ చేసి స్టేజ్‌ను హోరెత్తించాయి.

మామూలు స్టెప్స్ కాదు, అత్యంత కాంప్లెక్స్ మూమెంట్స్‌ను కూడా అత్యంత సహజంగా చేసి అందరినీ ఆకట్టుకున్నాయి.వీటి పర్‌ఫార్మెన్స్‌లో యాంకో డ్యాన్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

చైనీస్ ట్రెడిషనల్ ఫోక్ డ్యాన్స్ (Chinese Traditional Folk Dance)అయిన యాంకోలో చేతి రుమాళ్లు ఎగరవేసి పట్టుకోవాలి.రోబోలు అదికూడా పర్‌ఫెక్ట్‌గా చేసాయి.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

యూనిట్రీ రోబోటిక్స్ కంపెనీ ఈ అద్భుత మూమెంట్‌ను సోషల్ మీడియాలో గర్వంగా షేర్ చేసింది.కంపెనీ ట్వీట్ చేస్తూ, “Unitree H1: Humanoid Robot” స్ప్రింగ్ ఫెస్టివల్ గాలాలో తన డెబ్యూ చేసిందని వెల్లడించింది.అంతేకాదు, రోబోలు విసిరిన రుమాలు ఆటోమేటిక్‌గా తిరిగి తన పొజిషన్‌కి వచ్చేయడం ఓ కొత్త ఫీచర్ అని తెలిపింది.

నెటిజన్లు దీన్ని మైండ్ బ్లోయింగ్ ఫీచర్‌గా ప్రశంసిస్తున్నారు.ఈ పర్‌ఫార్మెన్స్ వీడియో వైరల్ అవడంతో, నెటిజన్లు భిన్నంగా స్పందించారు.ఈ వీడియోస్ ను చుసిన కొందరు AI ప్రపంచంలో, రోబోటిక్స్‌లో(world of AI, in robotics) ఇది అద్భుత పురోగతని కామెంట్ చేయగా.మరికొందరు డ్యాన్స్ అనేది హ్యూమన్ ఎమోషన్స్‌తో కూడిన కళ.రోబోలు ఎప్పటికీ ఆ భావోద్వేగాన్ని పలికించలేవని వారు అభిప్రాయపడ్డారు.మొత్తంగా, యూనిట్రీ H1 రోబోలు టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో రుజువు చేశాయి.

మనుషుల కంటే మెరుగైన సింక్రోనైజేషన్, అద్భుతమైన ఫీచర్లతో రోబోలు ముందుకు వస్తున్నాయి.కానీ, వీటి అభివృద్ధితో మన భవిష్యత్తు ఎలా మారబోతుంది? అన్న ఆలోచన అందరిలో స్టార్ట్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube