సాయి పల్లవి,నాగచైతన్య(Sai Pallavi, Naga Chaitanya) కలిసి నటించిన తాజా చిత్రం తండేల్(thandel).చందు మొండేటి (Chandu Mondeti)దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా డిసెంబర్ 7న విడుదలైన విషయం తెలిసిందే.
శ్రీకాకుళం జిల్లా(Srikakulam District) డి మత్స్యలేశం గ్రామం, కొన్ని గ్రామాలకు చెందిన మొత్తం 22 మంది మత్స్యకారులు పాకిస్థాన్ జైలులో చిక్కుకుపోవడం అనే అంశంఫై ఈ సినిమాను రూపొందించడంతోపాటు ఆ విషయాన్ని చాలా చక్కగా తెరకెక్కించారు.మత్స్యకారులు పాకిస్తాన్ జైల్లో చిక్కుకుపోవడం అన్నది వాస్తవమే.
దీంతో అప్పటి ప్రభుత్వం సంగతి ఎలా ఉన్నప్పటికీ అప్పటి ఎంపీ రామ్మోహన నాయుడు కేంద్ర మంత్రికి ఒక లెటర్ ఇచ్చినా కూడా పని జరగలేదు.

ఇక జగన్ పాదయాత్ర సమయంలో అక్కడికి వచ్చినప్పుడు ఈ విషయం తెలుసుకొని హామీ ఇవ్వడం కూడా జరిగింది. జగన్(Jagan) అధికారంలోకి వచ్చిన తరువాత కాస్త గట్టి కృషి జరిగింది.2022 మందిలో 20 మందిని ఒకసారి.మిగిలిన ఇద్దరిని మరోసారి పాక్ జైలు నుంచి బయటకు తెచ్చారు.వచ్చిన ప్రతి ఒక్కరికి అయిదు లక్షల వంతున సహాయం అందించారు కూడా.ఇదే కథతో ఇప్పుడు ఈ సినిమా వచ్చింది.కానీ సినిమాలో ఎక్కడా కూడా ఎంపీ లెటర్ కానీ జగన్ ప్రభుత్వ కృషి కానీ లేవు.
అయితే ఈ విషయం పట్ల ఇప్పటికే సోషల్ మీడియాలో కాంట్రవర్సీలు కూడా నడుస్తున్న విషయం తెలిసిందే.ఈ అంశాలను సినిమాలో ఎందుకు జోడించలేదు అంటూ కొందరు వైసీపీ నేతలు (YSRCP leaders)మండిపడుతున్నారు.
ఇప్పుడు ఇటు తెలుగుదేశం (Telugu Desam)అభిమానులు, అటు వైకాపా(YCP) అభిమానులు, వాళ్ల వాళ్ల మీడియాలు కలిసి ఎవరి లీడర్లను వాళ్లు అసలు సిసలు తండేల్ అంటూ హడావుడి చేస్తున్నారు.

స్టోరీలు వేస్తున్నారు.సోషల్ మీడియా లో పోస్ట్ ల మీద పోస్ట్ లు పెడుతున్నారు.దీని వల్ల వాళ్లకు ఏం క్రెడిట్ దక్కుతుంది అన్న సంగతి తెలియదు కానీ, తండేల్ సినిమాకు మాత్రం మంచి ఫ్రీ పబ్లిసిటీ దొరుకుతోందని చెప్పాలి.
సినిమా విడుదల తర్వాత ఈ సినిమా కాంట్రవర్సీ కావడంతో ఈ సినిమాకు తెలియకుండానే పబ్లిసిటీ పెరుగుతోంది.ఈ మూవీ మేకర్స్ కి బాగా కలిసి వస్తోంది.ఈ సినిమా గురించి తెలియని వారు ఈ సినిమా వ్యవహారాలు పట్టని వారు, ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న పొలిటికల్ వారు చూసి సినిమాపై ఆసక్తిని చూపిస్తున్నారు.దీంతో తండేల్ కలెక్షన్లు మొదటి రోజు కన్నా రెండో రోజు మరి కాస్త ఇంప్రూవ్ అయ్యాయి.
చూస్తుంటే ఈ కాంట్రవర్సీ ఇలాగే కంటిన్యూ అయ్యేలా కనిపిస్తోంది.అలాగే కలెక్షన్లు కూడా మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.








