మాజీ మంత్రి ఆర్కే రోజా కూతురు అన్షు మాలిక(Anshu Malika) తన ప్రతిభతో విభిన్న రంగాల్లో రాణిస్తున్నారు.ఇప్పటికే వెబ్ డెవలపర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా(web developer, content creator) పేరు తెచ్చుకున్న అన్షు, ఇప్పుడు ఫ్యాషన్ రంగంలోనూ తన మార్కు చూపుతున్నారు.
అయితే ఇటీవల నైజీరియాలో జరిగిన ‘గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ ఫెస్టివల్’ (Global Entrepreneurship Festival)లో అన్షు మాలిక ర్యాంప్ వాక్ (Anshu Malika ramp walk)చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.తన గ్లామర్, కాన్ఫిడెన్స్‌తో ప్రేక్షకులను మెప్పించారు.
ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీటిని షేర్ చేసిన అన్షు, “ఫ్యాషన్ రంగంలో ఇది నా తొలి అనుభవం.
భవిష్యత్తులో మరిన్ని గొప్ప అవకాశాలు అందిపుచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాను” అని తెలిపారు.

ఫ్యాషన్ మాత్రమే కాకుండా, అన్షు వ్యాపారరంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు.ఇటీవల ‘గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ అవార్డు’(‘Global Entrepreneurship Award’) అందుకుని యువతకు ఆదర్శంగా నిలిచారు.కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతూ, తాను ఎంట్రీ ఇచ్చిన ప్రతి రంగంలోనూ సక్సెస్ అవుతున్నారు.
తల్లి ఆర్కే రోజా రాజకీయాల్లో ఎంత పేరు తెచ్చుకున్నారో, అన్షు కూడా తన రంగాల్లో విజయపథంలో ముందుకు సాగుతున్నారు.కష్టపడి పనిచేసే నైపుణ్యం, సృజనాత్మకత(Skill, creativity) వల్ల ఆమె ఈ స్థాయికి చేరుకున్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉండటంతో, ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి.మొత్తంగా, అన్షు మాలిక తన ప్రతిభతో ప్రతీ రంగంలోను గుర్తింపు పొందుతూ, విజయపథంలో దూసుకెళ్తున్నారు.
ఇక ఈ ఫోటోలను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.కొందరు అన్షును పొగడ్తలతో ముంచెత్తగా మరికొందరు.తల్లితండ్రులు గొప్ప స్థానాలలో ఉండి ఇలాంటివి చేయడం అవసరమా అంటూ కామెంట్ చేస్తున్నారు.ఏదేమైనా ఎవరి టాలెంట్ ను వారు చూపించడంలో తప్ప ఏమీ లేదు.
కాబట్టి వారిని ప్రోత్సహించడమే మన బాధ్యత.







