ఇస్లాంలోని ఐదు మూల స్తంభాలలో జకాత్( Zakat ) కూడా ఒకటి.క్రీస్తు శకం 622లో మహమ్మద్ ప్రవక్త మదినాను సందర్శించినప్పుడు అక్కడ జకాత్ ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టారు.
అయితే అసలు ఎంత మొత్తాన్ని జకాత్‌గా దానం చేయాలని అంశంపై చాలా ప్రశ్నలు తరుచుగా వింటూనే ఉంటాము.ఈ విషయంపై ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ లో( Quran ) మార్గదర్శనం చేశారని ఇస్లామిక్ మత బోధకులు చెబుతూ ఉంటారు.
జకాత్ కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటప్పుడు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఇస్లామిక్ మత బోధకులు చెబుతున్నారు.

52.5 తులాల వెండి లేదా ఏడున్నర తులాల బంగారం లేదా దానికి సమానమైన మొత్తంలో నగదు లేదా ఇతర బాండ్లు, స్టాక్ లను ఏడాదికాలంగా కలిగి ఉన్న వ్యక్తి జకాత్ చెల్లించాలని ఇస్లామిక్ చట్టాలు చెబుతున్నాయి.మొత్తం తన దగ్గర ఉన్న సంపాదలో ఐదు శాతాన్ని జకాత్ గా పేదవారికి చెల్లించాలి.
అయితే ఎప్పుడు ఎవరికీ జకాత్ ఎప్పుడు ఎవరికి ఇవ్వాలి.ఎవరికి ఇవ్వకూడదు.
జకాత్ ఎవరు తీసుకుంటారు.దాన్ని ఎలా పంచుతారు.
ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఒక బ్యాంక్ నుంచి పర్సనల్ లోన్ తీసుకున్నారని అనుకోండి.వచ్చే ఏడాదికి వడ్డీని( Interest ) మొదటగా ఆ మొత్తం నుంచి వేరు చేయాలి.ఆ మిగిలిన మొత్తానికి జకాత్ వర్తిస్తుందని ఇస్లామిక్ మత బోధకులు చెబుతున్నారు.
అయితే రుణం ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని చెల్లించిన తర్వాత జకత్ ఇచ్చేందుకు సరిపడా సంపద లేకపోతే ఆ వ్యక్తి జకాత్ చెల్లించడం తప్పనిసరి కాదు.అలాగే వాణిజ్యపరంగా ఉపయోగించే భూములు, ఇల్లు, పంట పొలాల పై కూడా జకాత్ చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఇల్లు కట్టుకోవడానికి ఉంచుకున్న భూమి పై( Land ) జకాత్ చెల్లించాల్సిన అవసరం లేదు.తన పిల్లల కోసం నిర్మించిన లేదా ఉంచిన ఇంటి పై జకాత్ వర్తించదు.ఏదైనా దుకాణం ఉన్నట్లయితే లోపల ఉంచిన వస్తువుల పై జకాత్ చెల్లించాలి.అలాగే చాలా మంది తమ దగ్గర లేదా తమ కుటుంబం దగ్గర బంగారం, వెండి విలువైన ఆభరణాలు( Ornaments ) ఉంటేనే జకాత్ చెల్లించాలని భావిస్తారు.
అయితే తమ దగ్గర ఉండే నగదు, గిఫ్ట్ బాండ్లు, బంగారం, వెండి, విలువైన లోహాలు, వాణిజ్య వ్యాపారాల నుంచి వచ్చే ఆదాయం, పంటలు, పశుసంపద, నలభై కంటే ఎక్కువ గొర్రెలు లేదా మేకలు, 30 కంటే ఎక్కువ ఆవులు, గేదలు లాంటి వాటి పై జకాత్ వర్తిస్తుందని చెబుతున్నారు.
అలాగే జకాత్ ను నేరుగా పేదలకే ఇవ్వడం మంచిదని బోధకులు చెబుతున్నారు.
భార్య లేదా కుమార్తె ఆస్తుల పై లేదా ఆభరణాల పై జకాత్ చెల్లించే బాధ్యత భర్త లేదా తండ్రిపై ఉంటుంది.ఇక్కడ ఆభరణాలు ఉంటే బంగారం తో పాటు వెండివి కూడా ఉంటాయి.
మరో వైపు వజ్రాలు ఇతర విలువైన ఆభరణాలు పై కూడా జకాత్ చెల్లించాల్సి ఉంటుంది.జకాత్ కేవలం ముస్లింలకు( Muslims ) మాత్రమే ఇవ్వాలి.
అలాగే పేద ముస్లింలు, అప్పుల్లో కూరుకుపోయిన వారు, యాత్రలకు వెళ్లే వారు, అనాధలు, ఇస్లాంను స్వీకరించేవారు జకాత్ ను తీసుకోవచ్చు.