ప్రతి మనిషి జీవితంలో సంతోషంగా జీవించడానికి ప్రతిరోజు ఎన్నో కష్టాలను పడి డబ్బును సంపాదిస్తూ ఉంటాడు.జీవితంలో విజయం సాధించడానికి వారి స్థాయిలో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
వీరు విజయం కోసం ఎంతో కష్టపడి పని చేస్తూ ఉంటారు.అయితే కొన్నిసార్లు ఇలాంటి వ్యక్తులు చాలా సులభంగా విజయం సాధిస్తుంటారు.
కొంతమంది మాత్రం ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా వారి కష్టానికి తగ్గ ఫలితం ఎప్పుడు పొందలేరు.ఇలాంటి పరిస్థితుల్లో విఫలమైన వ్యక్తి తన అదృష్టాన్ని తరచుగా తిట్టుకుంటూ ఉంటాడు.
భవిష్యత్తు మీద దృష్టి పెట్టడం వల్ల యువత జీవితంలో ముందుకి వెళ్ళవచ్చు.
ఎందుకంటే అందమైన శాశ్వతమైన ఈ భవిష్యత్తు ను ఎప్పుడూ ముందుకు తీసుకువెళ్లాలని చాలామంది పెద్దవారు చెబుతూ ఉంటారు.
మనం మాట్లాడే ప్రతి మాట, ఆలోచన, పని మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని ఎప్పుడూ గుర్తు పెట్టుకోవడం మంచిది.ఒక మనిషి ఈరోజు చేసిన కర్మ రేపటి విధిగా మారుతుంది.
జీవితంలో కర్మతో ముడిపడి ఉన్న అదృష్టం నిజమైన అర్ధాన్ని చెబుతుంది.అలాంటి అదృష్టానికి సంబంధించిన విలువైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జీవితంలో మనం కష్టపడి సాధించిన విజయం, సంపద అవి కూడా మన తలరాతలో భాగమే.ప్రతి ఒక్కరికి జీవితంలో అదృష్టం అనేది ఒక్కసారే వస్తుంది.
అయితే మనిషి అన్న వాడు ఆ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకుంటాడా అనే దానిపై అతని విజయం ఆధారపడి ఉంటుంది.

విధిని దురదృష్టం అంటూ శపించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.ఎందుకంటే జీవితంలో మనకు లభించే ఏ విధమైన అపజయమైన, అవమానమైన మనకు మనమే బాధ్యత వహించాల్సిందే.జీవితంలో చోటు చేసుకున్న చెడుని ఎదుర్కోవడానికి ఇలాంటి వ్యక్తి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు.
భవిష్యత్తుపై భరోసాతో జీవితంలో ఉత్తమమైన సంఘటనలు ఉంటాయని ఆశతో ఉండడం మంచిది.జీవితంలో మనం పొందే మంచి చెడులను అంగీకరించి ప్రశాంతంగా ముందుకు సాగడమే ఉత్తమమైన పని.