మనదేశంలో దాదాపు చాలామంది ప్రజలు జరుపుకునే పండుగలలో రాఖీ పండుగ ( Raksha Bandhan )ముఖ్యమైనది.ప్రతి సంవత్సరం శ్రావణమాసం( Sravanamasam ) పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు.
ఈ సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున అంటే ఆగస్టు 30వ తేదీన రక్షాబంధన్ పండుగను అత్యంత వైభవంగా జరుపుకొనున్నారు.దీంతో ఇప్పటికే మార్కెట్లో రకరకాల రాఖీలు లభిస్తూ ఉన్నాయి.
మార్కెట్లో అన్ని రకాల రాఖీలు అందుబాటులో ఉన్నాయి.రాఖీల విషయంలో పెద్దల నుంచి పిల్లల వరకు భిన్నమైన ఆలోచనలతో ఎంపిక చేసుకుంటారు.
ఆధునిక కాలాన్ని దృష్టిలో ఉంచుకొని రాఖీలను ఎంపిక చేసుకునే విషయంలో పిల్లలు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.కార్టూన్ల నుంచి అనేక రకాల ఫ్యాషన్ రాఖీలను ఎంపిక చేసుకుంటూ ఉన్నారు.
సోదరీమణులు కొన్ని రకాల నిబంధనలను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.అయితే ఫ్యాషన్ పేరుతో అన్ని రకాల రాఖీలను సోదరుడి మణికట్టుకు కట్టడం మంచిది కాదు.
రాఖీ కొనే విషయంలో కొన్ని నిబంధనలో ఉంటాయి.సోదరుడి కోసం రాఖీలను ఎన్నుకున్నప్పుడు ఏ దారంతో తయారుచేసిన రాఖీలను కొనుగోలు చేయాలి? దాని ప్రాముఖ్యత ఏమిటి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే రాఖీ సోదరుడి జీవితం పై గొప్ప ప్రభావాన్ని చూపుతుందని పండితులు( Scholars ) చెబుతున్నారు.ఎర్ర రంగు దారం( Red thread Rakhi)తో చేసిన రాఖీనీ సోదరుడి మణికట్టుకు కట్టడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.అలాగే పువ్వులు, ముత్యాలతో చేసిన రాఖీలు కూడా సానుకూలతకు చిహ్నం అనీ పెద్దవారు చెబుతూ ఉంటారు.అందుకే రాఖీనీ ఎన్నుకునేటప్పుడు ఎక్కువగా థ్రెడ్ పై దృష్టి పెట్టాలి.
రక్షా కట్టడం ఒక వేడుక మాత్రమే కాదు.సోదరీ తన సోదరుడిపై చూపించే ప్రేమ, నమ్మకానికి చిహ్నం.

సోదరుడు తనను జీవితాంతం రక్షిస్తాడని ఎటువంటి పరిస్థితి ఎదురైనా అండగా ఉంటాడని నమ్మకం.సోదరుడి మణికట్టుకు పట్టుదరంతో కట్టే రాఖీలు కూడా చాలా పవిత్రమైనవిగా భావిస్తారు.రక్షాబంధన్ రోజున సోదరునికి పట్టుదరంతో చేసిన రాఖీలను కట్టడమే మంచిది.అంతే కాకుండా రక్షాబంధన్ రోజున సోదరుడి మణికట్టుకు కట్టడానికి ఎంచుకునే రాఖీలలో నీలం లేదా నలుపు దారంతో చేసిన రాఖీలు అసలు ఉండకూడదు.
ఎరుపు లేదా పసుపు దారం( Yellow thread Rakhi )తో చేసిన రాఖీలను మాత్రమే సోదరుడి మణికట్టుకు కట్టాలి.