మీ దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే ఈ నియమాలు పాటించండి!

భూమి పైన చాలా అందమైన ఇంకా స్వచ్ఛమైన బంధాలలో వివాహం ఒక్కటి.ఇది ఇద్దరి ఆత్మల యొక్క సంబంధం వారు జీవితాంతం ఒకరికొకరు కట్టుబడి ఉంటానని వాగ్దానం చేస్తారు.

 Astro Remedies For Married Life , Couples, Tulasi Pooja, Clean Home With Salt Wa-TeluguStop.com

సంతోషకరమైన వివాహ జీవితానికి అత్యంత కీలకమైన అంశం ఆనందం.ఇలాంటి అందమైన జీవితంలో వాస్తు దోషాలు ఉండడం వల్ల దాంపత్య జీవితంలో ఎన్నో సంఘర్షణలకు లోనవుతారు.

అయితే దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలి అంటే ఈ వాస్తు దోష నివారణ చర్యలు తీసుకోవాలి.దీని ద్వారా తిరిగి వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండి ఉంటుంది.

మంగళ, శని వారాలు మన జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి.ఈ రెండు రోజులు మాంసాహారం తినడం మానేయడం వల్ల దాంపత్య జీవితంలో ఎటువంటి సంఘర్షణలకు తావు ఉండదు.

వివాహం అంటే కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య కాకుండా, రెండు కుటుంబాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి.కుటుంబ సభ్యుల మధ్య ఏమైనా సమస్యలు ఉంటే, కుటుంబ శాంతికి భంగం కలిగిస్తూ ఉంటే శనివారం నల్లగ్రాములను, గోధుమలను కలపాలి.

ఇలా చేయడం ద్వారా ఆ కుటుంబం శాంతి, సామర్థ్యాన్ని పునరుద్ధరిస్తుంది.

ఇంట్లో గదిని శుభ్రం చేసేటప్పుడు నీళ్ళలో కొద్దిగా ఉప్పు కలుపుకొని శుభ్రం చేయటం ద్వారా మన ఇంట్లో ఉన్న ప్రతికూల వాతావరణం తొలగిపోయి.

అనుకూల వాతావరణం కలుగుతుంది.అంతేకాకుండా ఆ కుటుంబంలోని స్త్రీ ప్రతి రోజు తులసి మొక్కకు నీటిలో కొద్దిగా పసుపు కలిపి తులసి చెట్టుకు పోసి పూజించాలి.

ఇలా చేయడం ద్వారా దంపతులు ఇద్దరు సుఖసంతోషాలతో కలిగి ఉంటారు.

మహిళలు ఎల్లప్పుడూ పసుపు రంగు లేదా బంగారు రంగు గాజులను ధరించడం వల్ల ఆ ఇద్దరి మధ్య ప్రేమ బలపడుతుంది.

శుక్రవారం లక్ష్మీ దేవిని ఆరాధించి ఉపవాసం చేయడం ద్వారా సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడపవచ్చు.అంతేకాకుండా ప్రేమ, సన్నిహిత సంబంధం కలిగి ఉంటారు.అదేవిధంగా ఇంటి బయట ఆవరణంలో పూల కుండీల చెట్లను, తీగ చెట్లు పెంచడం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube