బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఎప్పుడు ఏదొక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.అందుకే ఈమెకు ఫైర్ బ్రాండ్ అనే ముద్ర పడింది.
ఈమెకు సంభంధం లేని విషయంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది.బాలీవుడ్ బడా హీరోలను సైతం గడగడ లాడిస్తూ ఉంటుంది.
ఎంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా సినిమాల్లో నటన మాత్రం అద్భుతంగా ఉంటుంది.ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
కంగనా ఎక్కువుగా నటనకు ఆస్కారం ఉన్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వరస హిట్లతో దూసుకు పోతుంది.ప్రస్తుతం కంగనా తలైవిసినిమా చేస్తుంది.ఈ సినిమాలో కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటిస్తుంది.ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది.
ఈ సినిమా విడుదలకు సిద్దమైన కరోనా కారణంగా వాయిదా పడింది.ఇప్పుడు పరిస్థితులు కొద్దిగా మెరుగవడంతో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.అయితే తాజాగా కంగనా మరొక క్రేజీ పాత్రలో నటించబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఈసారి కంగనా భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించ బోతుందని తెలుస్తుంది.ఇందిరా గాంధీ ఎమెర్జెన్సీ సమయంలో రాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట.

అయితే ఈ సినిమా ఇందిరా గాంధీ బయోపిక్ కాదని పీరియాడిక్ ఫిలిం గా తెరకెక్కిస్తున్నారని కంగనా తెలిపింది.అంతేకాదు ఈ సినిమా ద్వారా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ప్రజలకు బాగా అర్ధం అవుతాయని కూడా తెలిపింది.కంగనా రనౌత్ తన నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిలిమ్స్ లో ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేసారని తెలుస్తుంది.
కంగనా కూడా ఈ సినిమా కోసం ఇప్పటి నుండే మేకోవర్ మొదలు పెట్టినట్టు టాక్.