కర్ణాటక లో ఎన్నికల పోరు తీవ్రంగా ఉంది బిజెపిలు నువ్వా నేనా అన్నట్లు గెలిచేందుకు పోటీ పడుతున్నాయి.బిజెపి జాతీయ నాయకులంతా కర్ణాటకలోనే మతం వేశారు ఎటు పరిస్థితుల్లో అయినా మళ్ళీ బిజెపిని అక్కడ అధికారంలోకి తీసుకురావాలని పట్టదాలతో ఉన్నారు అలాగే కాంగ్రెస్ అధినాయకత్వం కూడా కర్ణాటక పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది రాహుల్ గాంధీ( Rahul Gandhi ) కూడా అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అక్కడ గెలుపు కోసం తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కీలకంగా ఉన్న నాయకులందరినీ అన్ని పార్టీలు కర్ణాటకలో మోహరించి నియోజకవర్గం ఇన్చార్జీలుగాను నియమించారు.ఇక కర్ణాటకలో కాంగ్రెస్ బిజెపి లలో ఏది గెలిచినా తముక్కు ఇబ్బందులే అన్న ఆందోళనలో తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ఉంది.
అక్కడ ఈ రెండు పార్టీల్లో ఏది గెలిచినా ఆ ప్రభావం స్పష్టంగా తెలంగాణపై ఉంటుందని, రెట్టించిన ఉత్సాహంతో అక్కడ గెలిచిన పార్టీ తెలంగాణపై ఫోకస్ పెడుతుందని ఆ ప్రభావం కచ్చితంగా తమపై పడుతుందని టిఆర్ఎస్ ఆందోళన చెందుతోంది అందుకే బిజెపి కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా జేడీఎస్ కు టిఆర్ఎస్ మద్దతు పలుకుతుంది అక్కడ ఏర్పడితే జెడిఎస్ ( JDS ) కీలకంగా మారుతుందని అప్పుడు కాంగ్రెస్ బిజెపిలో తెలంగాణలో అంత దూకుడుగా వ్యవహరించలేవని టిఆర్ఎస్ అంచనా వేస్తోంది.
బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు తెలంగాణ మంత్రులను కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి దింపేందుకు టిఆర్ఎస్ సిద్ధమవుతోంది అక్కడ విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే విధంగా మంత్రులు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తగిన సూచనలు చేశారు ముఖ్యంగా తెలంగాణతో సరిహద్దు పంచుకున్న కర్ణాటకలోని ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టి జెడిఎస్ అభ్యర్థులు గెలుపుకు కృషి చేసే విధంగా కేసిఆర్ వ్యవహారాలు రచిస్తున్నారు.అక్కడ బిజెపి, కాంగ్రెస్ కు స్పష్టమైన మెజార్టీ రాకుండా చేయడమే లక్ష్యంగా కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు.