శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా మూలపేట పోర్టు పనులకు రూ.4,362 కోట్ల వ్యయంతో శ్రీకారం చుట్టారు.అనంతరం జగన్ మాట్లాడుతూ మూలపేట పోర్టు సామర్థ్యం వంద బిలియన్లకు చేరుతుందని తెలిపారు.
మూలపేట ఇక అభివృద్ధికి మూలస్తంభంగా నిలుస్తుందని సీఎం జగన్ అన్నారు.చెన్నై, ముంబై మాదిరి శ్రీకాకుళం జిల్లా మారనుందని పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో జిల్లా ముఖచిత్రమే మారిపోతుందని తెలిపారు.ఎగుమతులు, దిగుమతుల ద్వారా మహా నగరంగా విరాజిల్లుతుందని చెప్పారు.
ఉద్యోగ అవకాశాలు లేక వలస వెళ్లిపోతున్నారన్న జగన్ అందుకే మరో రెండు ఫిషింగ్ హార్బర్స్ ను నిర్మిస్తున్నామని తెలిపారు.మత్స్యకారులకు మంచి జరగాలనే హార్బర్ నిర్మాణాలన్నారు.
ఈ 46 నెలల కాలంలో నాలుగు పోర్టులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు.







