ప్రస్తుతం వాతావరణం లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోయి చలి తీవ్రత ఎక్కువగా ఉంది.దీనివల్ల చాలామంది ప్రజలలో జలుబు దగ్గు లాంటి సమస్యలు వస్తున్నాయి.
ఈ సమస్యల నుంచి మన ఆరోగ్యాన్ని రక్షించుకోవాలంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి.ఈ ఆహారంలో భాగంగానే గుడ్డు తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గుడ్లలో చాలా రకాల పోషకాలు ఉన్నాయి.గుడ్లను ఫ్రై చేసి తినే కంటే ఉడకబెట్టి తినడం ఎంతో మంచిది.
ఉడకపెట్టిన గుడ్డులో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది.ఇది శరీరంలోని భాగాలకు బలాన్ని చేకూరుస్తుంది.
గుడ్లను రోజు తినడం వల్ల శరీరంలో అంతర్గతంగా వేడి పెరిగే అవకాశం ఉంది.
గుడ్లలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది.
విటమిన్ డి అనేది శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది.ఇది ఎముకలను పటిష్టం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గుడ్లలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటుంది.ఇవి మెదడులో సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టం చేస్తాయి.
చలికాలంలో అధికంగా కనిపించే గుండె పోటు లక్షణాలను ఇవి తగ్గిస్తాయి.ఎందుకంటే గుడ్లు గుండె ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.
అంతేకాకుండా డయాబెటిస్ ఉన్నవారు గుడ్డు విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది.
గుడ్డులో 200 మిల్లీగ్రాములు కొలెస్ట్రాల్ ఉంటుంది.అయితే ఇలా తినడం వల్ల డయాబెటిస్ వారికి మంచిది కాదు.ఉడకపెట్టిన గుడ్డు తింటే శరీరానికి 6.3 గ్రాముల ప్రోటీన్లు, 77 క్యాలరీలు, 212 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్, 0.6 గ్రాముల పిండి పదార్థాలు, 5.3 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు అలాగే విటమిన్ ఏ కూడా అందుబాటులో ఉంటాయి.40 సంవత్సరాల దాటిన వారు గుడ్లు తినేందుకు చాలా ఇష్టపడతారు.ప్రోటీన్లు, విటమిన్లు, క్యాల్షియం తీసుకుంటే శరీరం పూర్తిగా బలంగా తయారవుతుంది.బలహీనత దూరం అయ్యే అవకాశం ఉంది.అందుకోసం 40 సంవత్సరాలు దాటిన వారు రెగ్యులర్ గా డైట్ లో గుడ్డును తప్పనిసరిగా తీసుకోవాలి.