ఈ స్మార్ట్ యుగంలో స్కామ్ లు కూడా స్మార్ట్ గానే జరుగుతున్నాయి.అవును, ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్మార్ట్ ఫోన్( Smart phone ) ద్వారానే ఎక్కువగా ఆన్లైన్ మోసాలు అనేవి జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే ఏదైనా కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తే మనం మొదట చేసే పని… ట్రూకాలర్ లో ఆ నెంబర్ ఎవరిదని తెలుసుకోవడం.ఇలా స్కామ్ ల బారిన పడేవారిలో మనలో కూడా ఒకరు వుండే వుంటారు.
ట్రూ కాలర్ ఈ విషయం పైన స్పందిస్తూ… మా 100 మిలియన్ల మంది యూజర్లు గత మూడు నెలల్లో కనీసం ఒకసారి అయినా, ఒక మోసపూరిత SMSని అందుకున్నారని ట్రూకాలర్ తాజాగా ప్రకటించింది.

ఇకపోతే ఇలాంటి మోసపూరిత మెసెజ్ లు/ SMS నుండి సురక్షితంగా ఉండాలని పోలీసులు మరియు సైబర్ సెల్‌లు నిరంతరం ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంటాయి.ఇక ఈ నేపథ్యంలోనే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ట్రూకాలర్ యాప్‌లో( Truecaller app ) ఇప్పుడు కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టబడింది.ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమంటే, ట్రూ కాలర్ యాప్ లో లాంచ్ చేయబడిన ఈ కొత్త ఫీచర్ AI ఆధారంగా అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( Artificial Intelligence ) తో పని చేయడం విశేషం.

ట్రూ కాలర్ ఈ ఫీచర్‌ని ఫ్రాడ్ ప్రొటెక్షన్ అని పిలుస్తుంది.ఇది యూజర్ ఫీడ్‌బ్యాక్ మరియు మెషిన్ లెర్నింగ్‌ని ఉపయోగించి మోసపూరిత సందేశాలు/బ్రాడ్ SMSలను గుర్తించే AI-ఆధారిత రక్షణ సాధనంగా ఇది పని చేస్తుంది.మీరు ట్రూ కాలర్ యాప్ యూజర్ అయితే మీరు కూడా ఇలాంటి మోసపూరిత విషయాలలో చిక్కుకున్నట్టయితే మరేం భయపడకండి.ఇప్పుడు ట్రూ కాలర్ యాప్ ఎరుపు నోటిఫికేషన్‌తో ఈ మెసెజ్ ని డిస్ప్లే చేస్తుంది.
అంటే, నిర్దిష్ట మెసెజ్ లోని లింక్‌లను తెరవవద్దని, చదవవద్దని లేదా క్లిక్ చేయవద్దని మిమ్మల్ని హెచ్చరిస్తుందన్నమాట.మీరు మాన్యువల్‌గా తీసివేయబడే వరకు ఈ నిర్దిష్ట ఎరుపు నోటిఫికేషన్ మీ మొబైల్ స్క్రీన్‌పై అలాగే ఉంటుందని గమనించండి.







