సంక్రాంతి కానుకగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రం భారీ వసూళ్లను సాధించిందంటూ చిత్ర నిర్మాతలు ప్రకటిస్తూ ఉంటే కొందరు మాత్రం ఆ కలెక్షన్స్ ఫేక్ అంటూ తేల్చి పారేస్తున్నారు.200 కోట్ల వసూళ్లు నమోదు చేసిన సరిలేరు నీకెవ్వరు చిత్రం అంటూ ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు చాలా గొప్పగా ప్రకటించుకున్నారు.కాని సోషల్ మీడియాల అందుకు విభిన్నమైన టాక్ ఉంది.ఇదే సమయంలో సరిలేరు నీకెవ్వరు చిత్రం కలెక్షన్స్ మరింతగా పెంచేందుకు చిత్ర యూనిట్ సభ్యులు పాత పద్దతిని ఫాలో అవుతున్నారు.
సినిమా విడుదలైన వారం లేదా రెండు వారాల తర్వాత కొత్త సీన్స్‌ను యాడ్ చేసి మళ్లీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేయడం చాలా మంది హీరోలు గతంలో చేశారు.ఇప్పుడు అదే పద్దతిన మహేష్ బాబు కూడా ఈ చిత్రంకు ప్రేక్షకులు మళ్లీ రావాలనే ఉద్దేశ్యంతో మరియు ఇప్పటి వరకు చూడని ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించే ఉద్దేశ్యంతో కొత్త సీన్స్‌ను యాడ్ చేయబోతున్నారు.
ట్రైన్ కామెడీ ఎపిసోడ్స్‌ను మరో అయిదు నిమిషాలు పెంచి, సెకండ్ హాఫ్‌లో 10 నిమిషాల కామెడీ సీన్స్‌ను జత చేయబోతున్నారట.

ఈ కొత్త సీన్స్‌తో సినిమాకు మళ్లీ ప్రేక్షకులు వస్తారా అనేది చూడాలి.అల వైకుంఠపురంలో చిత్రంకు గట్టి పోటీ ఇచ్చినా కూడా ఆ సినిమా ముందు నిలబడలేక పోయింది అనేది కొందరి టాక్.ఇక ఈ చిత్రంలో అన్ని వర్గాల వారు మెచ్చే ఎంటర్‌టైన్మెంట్ ఉందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
విజయశాంతి రీ ఎంట్రీ చిత్రంకు ప్లస్ అయ్యింది.రష్మిక ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించగా కీలక పాత్రలో సంగీత మరియు రాజేంద్ర ప్రసాద్‌లు నటించారు.