తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.హీరోగా విలన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు గోపీచంద్.
కాగా గోపీచంద్ జయం,వర్షం సినిమాలలో విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.యజ్ఞం, రణం, లక్ష్యం, సాహసం,లౌక్యం లాంటి సినిమాలలో హీరోగా నటించాడు.
అయితే ఈ సినిమాలన్నీ హీరో గోపీచంద్ కి మంచిగా గుర్తింపును తెచ్చి పెట్టిన విషయం తెలిసిందే.ఈ సినిమాలలో ఒక సెంటిమెంట్ కూడా ఉంది.
అదేమిటంటే టైటిల్స్ చివరలో సున్నా ఉండటం.
ఆ సెంటిమెంట్ బాగా కలిసి వచ్చి హీరోగా విలువ మంచిగా గుర్తింపు దక్కడంతో ఆ సెంటిమెంట్‌ను వదలను అంటున్నాడు గోపీచంద్.
తన అపజయాలకు బ్రేక్ వేయాలంటే పాత దారినే నమ్ముకోవాలి అనుకుంటున్నాడు.ఇకపోతే శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా రామబాణం. ఈ సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హయతి హీరోయిన్ గా నటించనుంది.ఈ సినిమా టైటిల్ లో చివర్లో సున్నా ఉండడంతో పాత సెంటిమెంట్ ని నమ్ముకోవాలి అనుకుంటున్నాడు గోపీచంద్.
మరి గోపీచంద్ నమ్మకున్న విధంగా ఈ రామ బాణం సినిమా మంచి సక్సెస్ ని తెచ్చి పెడుతుందో లేదో చూడాలి మరి.
ఇకపోతే గోపీచంద్ నటించిన సినిమాలలో ఒంటరి,వాంటెడ్, జిల్, ఆక్సిజన్,చాణక్య ,అరడుగుల బుల్లెట్ లాంటి సినిమాలన్ని డిజాస్టర్ లుగా నిలిచాయి.ఈ సినిమా చివర్లలో సున్నా లేకపోవడంతో అందుకే డిజస్టర్ లుగా నిలిచాయి అనుకుంటున్నారు గోపీచంద్.మరి గోపీచంద్ నమ్ముకున్న రామబాణం సినిమా గోపీచంద్ కు సక్సెస్ ను తెచ్చి పెడుతుందో లేదో చూడాలి మరి.గోపీచంద్ చివరగా సిటీ మార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదల అయ్యి మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.