బాలీవుడ్ సీనియర్ నటి వీణా కపూర్ ని తన కొడుకు అభిషేక్ చడ్డా హత్య చేశాడు అంటూ వార్తలు జోరుగా వినిపించిన సంగతి మనందరికీ తెలిసిందే.ఆస్తి కోసం కన్నతల్లిని హత్య చేశాడు అంటూ వార్తలు జోరుగా వినిపించాయి.
అయితే ఆ వార్తలన్నీ అబద్ధాలని తాను ఇంకా బతికే ఉన్నట్లుగా వీణా కపూర్ తాజాగా పోలీసులకు ముందుకు ప్రత్యక్షమైంది.తాను చనిపోయినట్లు పుకార్లు పుట్టించిన వ్యక్తుల పై తగిన చర్యలు తీసుకోవాలంటూ తన కుమారుడు అభిషేక్ చడ్డాతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది వీణా కపూర్.
తాజాగా ఈ విషయం పై వీణా కపూర్ మాట్లాడుతూ.నా కొడుకు నన్ను హత్య చేశాడు అంటూ వచ్చిన వార్తలు పూర్తిగా అబద్ధం.
అసలు నిజమేంటంటే వీణా కపూర్ పేరుతో ఉన్న మరో మహిళపై మర్డర్ జరిగింది.కానీ ఇక్కడ ఇద్దరి పేర్లు ఒకటే అయినంత మాత్రాన ఆ మరణాన్ని నాకు ఆపాదిస్తారా? నేను జుహులో కాదు, గుర్గావ్‌లో ఉంటున్నాను.నా కొడుకుతో కలిసి నివసిస్తున్నాను.నేను చనిపోలేదు, బతికే ఉన్నాను.
దయచేసి అసత్యపు ప్రచారాన్ని నమ్మకండి.ఇప్పటికే దీనిపై మేము ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాం.
పోనీలే అని కంప్లైంట్ చేయకుండా వదిలేస్తే రేపు ఇంకొకరికి కూడా ఇలాగే జరుగుతుంది.ఇప్పటికే వందల ఫోన్ కాల్స్‌తో నాకు మెంటల్ టార్చర్ అవుతుంది.
షూటింగ్‌లో నా వర్క్ పై ఫోకస్ చేయలేకపోతున్నాను.ఇంకెవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పుకొచ్చింది వీణా కపూర్.
అనంతరం వీణా కపూర్ తనయుడు అభిషేక్ చడ్డా మాట్లాడుతూ.

అమ్మను ఎందుకు చంపావని చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు.నేను తనను చంపలేదు, తను బతికే ఉంది.నేను నా తల్లిని కిరాతకంగా హత్య చేసినట్లు వార్తలు వచ్చాయి.
అది చూసి నేను అస్వస్థతకు లోనయ్యాను.అసలు ఇలాంటిది నేను కలలో కూడా ఊహించలేదు.
అమ్మంటే నాకెంతో ఇష్టం.దయచేసి ఇక అసత్య ప్రచారాలకు ఫుల్‌స్టాప్ పెట్టండి అని కోరాడు.







