నాని బలగం వేణు కాంబో మూవీ క్యాన్సిల్ అయిందా.. ఈ సినిమాకు సమస్య ఇదేనా?

తెలుగు సినీ ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్, డైరెక్టర్ వేణు( Director Venu ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు కమెడియన్ గా ఎన్నో స్కిట్లు చేసి ప్రేక్షకులకు అలరించిన వేణు బలగం సినిమాతో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే.

 What Happend To Nani And Venu Yellamma , Nani, Balagam Movie, Tollywood, Movie C-TeluguStop.com

మొదటి సినిమాతోనే దర్శకుడిగా భారీగా గుర్తింపును తెచ్చుకున్నారు.చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా భారీగా కలెక్షన్లను సాధించింది.

ఇక బలగం సినిమా( Balagam ) తర్వాత వేణు ఎలాంటి సినిమా చేస్తాడా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

బలగం తరువాత మంచి కథ తయారు చేసుకుని, పెద్ద సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు.దిల్ రాజు ఆస్ధానంలో వుండి హీరో కోసం చూస్తున్నాడు వేణు.అయితే ఇలాంటి టైమ్ లో బలగం సినిమా చూసి, వేణుతో సినిమా చేయాలని హీరో నాని సరదా పడ్డాడు.

వేణు కథ చెప్పాడు.దాదాపు ఓకె అయింది.

నానితో సినిమా చేయాలని నిర్మాత దిల్ రాజు( Dil Raju ) కూడా చాలా సరదా పడ్డారు.నాని నటిస్తున్న సరిపోదా శనివారం సినిమా తరువాత బలగం వేణుతో సినిమా చేయాలా? దసరా దర్శకుడు శ్రీకాంత్( Director Srikanth ) తో సినిమా చేయాలా అన్నది డిస్కషన్లు సాగి, ముందుగా దసరా డైరక్టర్ వైపే మొగ్గాడు.

అంత వరకు బాగానే వుంది.కానీ ఆ తురవాత బలగం వేణు సినిమా వుంటుందా? అంటే అది డవుట్ గానే వుంది.ఎందుకంటే బలగం వేణు చెప్పిన కథకు, దసరా దర్శకుడు శ్రీకాంత్ చెప్పిన కథకు అక్కడక్కడ పోలికలు వుండడమే సమస్య అయింది.దాంతో బలగం వేణు పెట్టుకున్న కథ మరి ఇక నాని తీసుకోరు.

మరో కథ ఏదైనా కనుక సెట్ చేస్తే, అప్పుడు మాత్రం సినిమా చేస్తారు.కాబట్టి నాని బలగం వేణు కాంబినేషన్ లో వచ్చే సినిమా క్యాన్సిల్ అయినట్టే అని వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube