పూలను వాణిజ్య పంటగా సాగు చేయాలనుకుంటే..పాలి హౌస్ లో ఇలా సాగు చేసేయండి..!

పూలను వాణిజ్య పంటగా సాగు చేయాలనుకుంటే సాధారణ పద్ధతిలో ఆరుబయట నేలలో కాకుండా పాలిహౌస్ లో సాగు చేస్తేనే అధిక లాభాలు అర్జించవచ్చు.పాలి హౌస్( Polyhouse ) లో పూల సాగు చేపట్టి వివాహ శుభకార్యాలకు ఒకేలా తయారికి అవసరమైన పూలను సప్లై చేసి మంచి ఆదాయం పొందవచ్చు.

 If You Want To Cultivate Flowers As A Commercial Crop Cultivate It Like This In-TeluguStop.com

పాలి హౌస్ లో సాగు చేసిన పూలే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికి ఉపయోగపడతాయి.

పాలీ హౌస్ లో సేంద్రియ ఎరువులకు( Organic fertilizers ) అధిక ప్రాధాన్యం ఇచ్చి, మొక్కల మధ్య మొక్కల వరుసల మధ్య కాస్త అధిక దూరం ఉండేటట్లు నాటుకోవాలి.పాలీ హౌస్ లో సాగు చేసిన పూలకు తెగుళ్ల, చీడపీడల బెడద చాలా తక్కువగా ఉంటుంది.కాబట్టి అనవసర పిచికారి మందుల అవసరం ఉండదు.

సీజన్ ను బట్టి, మార్కెట్లో పూలకు ఉండే డిమాండ్ ను బట్టి ఒకే రకమైన పూలను కాకుండా నాలుగు లేదా ఐదు రకాల పూలను సాగు చేయాలి.అప్పుడు నష్టం అనేది వచ్చే అవకాశం ఉండదు.పాలీహౌస్ పూలను ఇతర ప్రదేశాలకు రవాణా చేయాలనుకుంటే పూలను సేకరించి ఒక చల్లటి వాతావరణం ఉండే గదిలో భద్రపరచాలి.ఆ పూలను గుత్తిగా తయారు చేసి వాటిని ప్లాస్టిక్ కవర్ ను తొడిగి అట్టపెట్టెలో భద్రపరిచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాలి.

ఒక ఎకరం పొలంలో దాదాపుగా 20 వేలకు పైగా మొక్కలు నాటుకోవచ్చు.నీటిని డ్రిప్ విధానం ద్వారా అందిస్తే మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి.కలుపు మొక్కల సమస్య ఉండదు.దాదాపుగా అన్ని ఖర్చులు తీసేస్తే రూ.5 లక్షల పైగానే ఆదాయం వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube