జీవితంలోకి స్పెషల్ వ్యక్తి రాబోతున్నారు... ప్రభాస్ పోస్ట్ పెళ్లి గురించేనా?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) ప్రస్తుతం వరస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే తప్పకుండా అందరికీ ప్రభాస్ పేరు గుర్తుకు వస్తుంది ఈయన పెళ్లి గురించి ప్రశ్నలు వేసిన ప్రతిసారి కూడా ఏదో ఒక సమాధానం చెబుతూ తప్పించుకుంటూ ఉంటారే తప్ప పెళ్లి ఎప్పుడు అనే విషయం గురించి క్లారిటీ ఇవ్వలేదు.

 Prabhas Latest Instagram Post Goes Viral In Social Media, Prabhas, Marriage, Spe-TeluguStop.com

ఇప్పటికే ప్రభాస్ నాలుగు పదుల వయసులో ఉన్నారు.

ఇప్పటికీ ప్రభాస్ పెళ్లి( Marriage ) గురించి ఆలోచించకపోవడంతో తరచూ ఈయన పెళ్లికి సంబంధించి ఎన్నో ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.ఇక సోషల్ మీడియాలో తాజాగా ప్రభాస్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.సోషల్ మీడియాలో పెద్దగా ఎలాంటి పోస్టులు చేయని ప్రభాస్ తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా చేసినటువంటి పోస్ట్ సంచలనగా మారింది.

ఈ పోస్ట్ చూసినటువంటి అభిమానులు ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇందులో భాగంగా ప్రభాస్ డార్లింగ్.మా జీవితంలోకి ఒక స్పెషల్ వ్యక్తి ( Special Person ) రాబోతున్నారు వెయిట్ చేయండి అంటూ ఒక పోస్ట్ చేశారు.అయితే ఈ పోస్ట్ తప్పనిసరిగా ప్రభాస్ తన పెళ్లి గురించి చేశారని తాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇలా తెలియజేశారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మరి ప్రభాస్ నిజంగానే పెళ్లి గురించే ఈ పోస్ట్ చేసి ఉంటే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పాలి.మరి ఈ పోస్ట్ ఏ ఉద్దేశంతో చేశారనేది తెలియాలి అంటే వెయిట్ చేయక తప్పదు.

ఇక ప్రభాస్ ప్రస్తుతం కల్కి( Kalki ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube