జూనియర్ ఎన్టీఆర్ సినిమా విషయంలో అన్యాయం.. ఈషా రెబ్బా షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా (eesha rebba) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగులో పలు సినిమాలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Eesha Rebba Made Intresting Comments On Aravinda Sametha, Eesha Rebba, Aravinda-TeluguStop.com

కేవలం నటనతో మాత్రమే కాకుండా అందంతో ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేసింది.అలా తెలుగులో వరుస సినిమాలలో నటించి మెప్పించింది .చిన్న సినిమాలకు ఈ భామ బెస్ట్ ఆప్షన్ గా నిలిచింది.అయితే అనుకోకుండా ఒక పెద్ద సినిమాలో ఈ భామకు ఆఫర్ వచ్చింది.

ఆ సినిమానే ఎన్టీఆర్ (ntr) నటించిన అరవింద సమేత(Aravinda Sametha) .అయితే ఈ సినిమా విషయంలో తనకు బాధ ఉండేదని ఈషా రెబ్బా చెప్పుకొచ్చింది.

Telugu Eesha Rebba, Pooja Hegde, Tollywood, Trivikram-Movie

ఎన్టీఆర్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ తెరకెక్కించిన ఈ సినిమా 2018 అక్టోబర్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది.ఈ సినిమాలో పూజా హెగ్డే (Pooja Hegde)హీరోయిన్ గా నటించింది.అలాగే ఈషా రెబ్బా సెకండ్ హీరోయిన్ గా నటించింది.అయితే తాజాగా ఈషా రెబ్బా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది.ఈ సందర్బంగా ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ.నేను నటించిన మొదటి పెద్ద చిత్రం అరవింద సమేత.

ఆ సినిమా కోసం చిత్ర యూనిట్ నన్ను సంప్రదిస్తే నటించేందుకు నేను ఆసక్తి చూపలేదు.మెయిన్ హీరోయిన్ గా చేయాలనీ వుంది అని చెప్పాను.

Telugu Eesha Rebba, Pooja Hegde, Tollywood, Trivikram-Movie

అయితే ఈ సినిమాలో మీదీ ప్రధాన పాత్రే అని దర్శక, నిర్మాతలు తెలిపారు.కొన్ని రోజుల తర్వాత నటించడానికి ఒప్పుకున్నాను.నాపై ఒక పాట కూడా చిత్రీకరించాలని ప్లాన్‌ చేశారు.కానీ, అది జరగలేదు.అయితే ఇంకొన్ని సీన్స్‌ ఎడిటింగ్‌లో తొలగించారు వీటికి కారణమేంటో నాకు తెలియదు.ఆ సినిమా విషయంలో మాత్రం బాధ ఉండేది.

కానీ, ఎన్టీఆర్‌తో(NTR) నటించడం, త్రివిక్రమ్‌(Trivikram) గారి దర్శకత్వంలో వర్క్‌ చేయడం ఆనందాన్ని ఇచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube