వీడియో: పందిని చంపేద్దాం అనుకున్న చిరుతపులి.. ఊహించని షాక్‌తో తల్లడిల్లింది..?

చిరుత పులులు( leopard ) బాగా ఆకలితో ఉంటాయి.అవి తమ ఆకలిని తీర్చుకునేందుకు ఎలాంటి జీవినేనా వేటాడుతాయి నీటిలో ఉన్నా, గాలిలో ఎగురుతున్నా, భూమిపై పరిగెడుతున్నా అవి ప్రతి జీవిని టార్గెట్ చేస్తాయి.

 Video: A Leopard Who Thought To Kill A Pig, Was Shaken By An Unexpected Shock,-TeluguStop.com

ఎంత ప్రమాదం ఉందని తెలిసినా అవి మిగతా జీవులను చంపడానికే మొగ్గు చూపిస్తాయి.అలాంటి ధోరణి వాటిని ఒక్కోసారి ప్రమాదంలో పడేస్తుంటుంది.

ఇటీవల ఒక చిరుత ముళ్ల పంది జోలికి వెళ్లి చివరికి తన తప్పు తెలుసుకుంది.

ముళ్లపంది( Thorny pig ) శరీరం చుట్టూ పదునైనా ముళ్ళు ఉంటాయి.అవి గుచ్చుకుంటే చాలా బాధ వేస్తుంది.కానీ చిరుత పులి సాహసించి దానిని చంపేసి తినాలనుకుంది.

దానిని ఎలాగైనా చంపి ఆకలి తీర్చుకుందామని ప్రయత్నించింది కానీ ముళ్లపంది తన శరీరంపై వున్న ముళ్లతో ప్రతి దాడి చేస్తూ చిరుతపులికి చుక్కలు చూపించింది.దాంతో చిరుతకు మరింత కోపం వచ్చింది.

దాన్ని ఎలాగైనా కసిగా కొరికేసి తినేయాలని కొత్త వ్యూహాలను అమలు చేయడం మొదలు పెట్టింది ఇందులో భాగంగా.రోడ్డుపై జారుతూ తలను నేలకు ఆనించి ముళ్ళ పందిని కింద నుంచి కరిచేద్దామని చూసింది.

ఈ ఊహించని దాడికి ముళ్ళ పంది ఉలిక్కిపడింది.వెంటనే అది ఎడాపెడా తన ఒంటిమీద ఉన్న ముళ్లులను చిరుత పులి ముఖంపై పొడి చేసింది.

ఆ దెబ్బకు చిరుత పులి అల్లాడిపోయింది.ముల్లులు మూతి ముఖం ప్రాంతంలో లోతుగా దిగడంతో అది విలవిల్లాడుతూ ఆర్తనాదాలు పెట్టింది.

ఆ పందిని వదిలేసే బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి వెనక్కి తిరిగింది.ఆ సమయం అంతటా అది ముల్లును తొలగించుకోవడానికి నోటిపై పంజాతో రుద్దుకుంటూ కనిపించింది.ముళ్ల కారణంగా చిరుత మూతి నుంచి రక్తం కారడం మొదలయ్యింది.ఈ ఘటనతో ఆ పులి కచ్చితంగా ఒక జీవితం పాఠం నేర్చుకునే ఉండే ఉంటుంది.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube