మూడు సంవత్సరాలలో ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం సులువైన విషయం, సాధారణమైన విషయం అస్సలు కాదనే సంగతి తెలిసిందే.ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం చాలామంది సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది.
అయితే కీర్తి నాయుడు అనే యువతి మాత్రం ఆరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించింది.

సరైన ప్రణాళికతో కష్టపడితే లక్ష్యాన్ని సాధించడం సులువేనని ఆమె కామెంట్లతో అర్థమవుతోంది.రాజమహేంద్రవరం( Rajamahendravaram )లోని ధవళేశ్వరానికి చెందిన కీర్తి నాయుడు వయస్సు 24 సంవత్సరాలు.2019 సంవత్సరంలో ఏపీలో సచివాలయ కార్యదర్శి జాబ్ సాధించిన కీర్తి తాజాగా జీఎస్టీ ఇన్స్ పెక్టర్ ఉద్యోగాన్ని సాధించి వార్తల్లో నిలిచారు.కీర్తి తండ్రి మురళీకృష్ణ అడ్వకేట్ గా పని చేస్తుండటం గమనార్హం.

పక్కింటమ్మాయి నాగసత్య వరలక్ష్మి తనకు ఇన్స్పిరేషన్ అని ఆమె ఎయిమ్స్ లో ఎంబీబీఎస్ చదివి ఇప్పుడు ఎండీ చేస్తోందని కీర్తి( Keerthy ) అన్నారు.డిగ్రీ పూర్తయ్యాక జాబ్ కోసం రోజుకు 10 గంటల పాటు ప్రిపేర్ అయ్యానని కీర్తి తెలిపారు.సచివాలయ జాబ్ వచ్చినా వదులుకుని ఆదాయపు పన్ను శాఖ( Income Tax Department )లో ట్యాక్స్ అసిస్టెంట్ జాబ్ లో చేరానని కీర్తి నాయుడు కామెంట్లు చేయడం గమనార్హం.
ఆ జాబ్ చేస్తూనే ఇతర జాబ్స్ కు ట్రైనింగ్ తీసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. స్టాఫ్ సెలక్షన్ కమీషన్ పరీక్షలో ఎంటీఎస్ జాబ్, రైల్వేలో ట్రైన్ క్లర్క్, 2022లో సీ.హెచ్.ఎస్.ఏలో పోస్టల్ అసిస్టెంట్, అదే ఏడాది జీఎస్టీలో ట్యాక్స్ అసిస్టెంట్ జాబ్స్ వచ్చాయని తాజాగా జీఎస్టీ ఇన్స్పెక్టర్ జాబ్ వచ్చిందని కీర్తి పేర్కొన్నారు.ఆరు ప్రైవేట్ జాబ్స్ వచ్చినా చేరలేదని ఆమె తెలిపారు.
కీర్తి టాలెంట్ తో కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతుండటం గమనార్హం.