కాజల్ భర్త పై హైపర్ ఆది సెటైర్స్.. ఆరోజు నా డెడ్ డే అంటూ కామెంట్స్!

వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ ( Kajal Agarwal ) ప్రస్తుతం సత్యభామ( Satyabama ) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీబిజీగా గడుపుతున్నారు.త్వరలోనే ఈమె సత్య భామ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పలు బుల్లితెర కార్యక్రమాలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.

 Hyper Aadi Satires On Kajal Husband At Dhee Show, Hyper Aadi, Dhee Show, Sathyab-TeluguStop.com

అయితే తాజాగా కాజల్ అగర్వాల్ ఢీ డాన్స్ ( Dhee Dance show ) షోలో సందడి చేశారు.ఇక ఈమె ఈ కార్యక్రమంలోకి మగధీర సినిమాలోని ధీర ధీర అనే పాటతో ఎంట్రీ ఇచ్చారు.

ఇక కాజల్ అగర్వాల్ కు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఘనంగా స్వాగతం పలికారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది ( Hyper Aadi ) కాజల్ అగర్వాల్ తో మాట్లాడుతూ చేసిన కామెడీ అందరిని నవ్వించింది.కాజల్ రాగానే హైపర్ ఆది తనని ఇంప్రెస్ చేయటం కోసం ఫ్లటింగ్ మొదలు పెట్టాడు.మీ పెళ్లి రోజు అక్టోబర్ 30 కదా అని హైపర్ ఆది కాజల్ అని అడిగాడు.

కాజల్ అవునని సమాధానం చెప్పారు.

ఇలా తన పెళ్లి తేదీ గురించి కాజల్ చెప్పడంతో వెంటనే హైపర్ ఆది ఆరోజు నా డెడ్ డేట్ అంటూ సమాధానం చెప్పి అందరిని నవ్వించారు.ఇక మీకు పెళ్లి కాకముందు మీ గురించి నేను ఎన్నో కవితలు రాశాననీ చెప్పగా.పెళ్లి తర్వాత అంటూ కాజల్ అడిగారు.

పెళ్లి తర్వాత కిచ్లు బాధితుడిగా మారాను అంటూ ఆమె భర్తపై సెటైర్ వేశాడు. దీంతో అక్కడ ఉన్నటువంటి వారందరూ నవ్వుకున్నారు.

ఇక ఎన్టీఆర్ కాజల్ అగర్వాల్ నటించిన బాద్షా సినిమాలోని ఓ పాటకు శేఖర్ మాస్టర్ తో కలిసి ఈమె అద్భుతమైనటువంటి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube