టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీలో నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
కాగా ఎన్టీఆర్ చివరగా ఆర్ఆర్ఆర్ (RRR)మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా విడుదల అయ్యి రెండేళ్లు దాటిపోతున్న కూడా ఇప్పటివరకు ఎన్టీఆర్ నుంచి ఎటువంటి సినిమా విడుదల కాలేదు.
దీంతో ఎన్టీఆర్ తదుపరి మూవీ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఎన్టీఆర్(NTR) నటిస్తున్న దేవర ( Devara)మూవీ రెండు పార్ట్ లుగా విడుదల కానుంది.అలాగే ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.అక్టోబర్ 10న దేవర పార్ట్ 1 సినిమా రానుంది.
ఇక మే 19న ఎన్టీఆర్ పుట్టిన రోజుకి ఒక రోజు ముందే దేవర నుంచి ఫస్ట్ సాంగ్ రాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు చిత్ర బృందం.ఇక దేవర తర్వాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమా చేస్తున్నారు.
ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి.

కాగా ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ (ntr, prashanth neel )ఒక సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర, వార్ 2 (Devara, War 2)సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు.ఇవి అయ్యాక ప్రశాంత్ నీల్ సినిమా మొదలవుతుందని సమాచారం.
ఇప్పటికే వీరికి కాంబోలో సినిమా అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.తాజాగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు మే 20న అనౌన్స్ చేస్తారని సమాచారం.
ఈ సినిమాకు డ్రాగన్ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టినట్టు టాలీవుడ్ లో వినిపిస్తుంది.అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఎదురుచూడాల్సిందే మరి.