రోడ్డుపై వెళ్తుండగా బైక్ నుంచి ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటలు.. చివరికి..?

ప్రస్తుతం భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి.ఈ కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్స్ మాత్రమే కాదు పెట్రోల్ బైకుల( Petrol bikes )కు కూడా మంటల్లో చిక్కుకుంటున్నాయి.

 While Going On The Road, The Fire Suddenly Burst From The Bike In The End, Moto-TeluguStop.com

ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్న వేళ పెట్రోల్ ఒక్కసారిగా మండేస్తూ బైక్ ని మొత్తం దగ్ధం చేస్తున్నాయి.అంతేకాదు దానిపై ప్రయాణిస్తున్న వారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నాయి.

నిప్పు అంటుకున్న వాహనాలకు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.తాజాగా ఇలాంటి మరొక ఫైర్ యాక్సిడెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.vashusingh123 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను పంచుకున్నారు.

వైరల్ వీడియో ఓపెన్ చేస్తే ఒక వ్యక్తి ఎల్లో కలర్ బైక్‌ ( Bike )ను నడుపుతూ రోడ్డుపై దూసుకెళ్లడం చూడవచ్చు.అది ఒక సూపర్ బైక్ లాగా కనిపిస్తోంది.బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన మోటార్ సైకిల్ లాగా కనిపిస్తోంది.

దానిని అతను తోలుకుంటూ బాగా యాగ్జలరేషన్ ఇస్తున్నాడు.ఎండ బాగానే ఉన్నట్లు కూడా మనం వీడియోలో గమనించవచ్చు.

ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం అతను గాగుల్స్ ధరించాడు.ఇతను ఒక ట్రావెలర్ లాగా కనిపిస్తున్నాడు.

అందుకే అతని వీపుకు ఒక బ్యాగ్ ఉంది.స్టైల్‌గా బైక్ మీద వెళ్తున్న ఈ వ్యక్తికి ఒక్కసారిగా ఊహించని షాక్‌ తగిలింది.

బైక్ యాక్సిలరేటర్ రైజ్ చేయగానే ఇంజన్ భాగం నుంచి టైరు వెనుక భాగం వరకు ప్రాంతంలో ఒక్కసారిగా పెద్దగా మంటలు ఎగిసిపడ్డాయి.రెప్పపాటు సమయంలో మొదలైన మంటలు బైక్ అంతటా వ్యాప్తి చెందాయి.ఈ మోటార్ సైకిల్ అలా మంటల్లో చిక్కుకుపోగా రైడర్ దాని పైనుంచి దూకి ప్రాణాల కోసం పరిగెత్తాడు.ఆ షాకింగ్ దృశ్యాలు కూడా వీడియోలో చూడవచ్చు.అతనికి ఎంత పెద్ద గాయాలయ్యాయో తెలియ రాలేదు కానీ ప్రాణాలతో బయటపడ్డాడని తెలుస్తోంది.ఈ వీడియో చూసి చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదాలే కాకుండా అగ్ని ప్రమాదా( Fire accidents )లు కూడా వాహనదారులకు పెద్ద ముప్పులాగా మారుతున్నాయని కామెంట్ చేస్తున్నారు.షేర్ చేసిన సమయం నుంచి ఈ క్లిప్పు తొమ్మిది లక్షల దాకా లైక్స్ కోట్లలో వ్యూస్ వచ్చాయి.

దీనిని మీరు కూడా చూసేయండి.సాధారణంగా బైకులు మంటల్లో చిక్కుకుపోవని, ఏదైనా మార్పు చేస్తేనే అవి మాల్ ఫంక్షన్ అయ్యి ఇలా మంటలు ఎగిసి పడతాయని వీడియో చూసిన కొందరు కామెంట్ చేశారు.

బహుశా పెట్రోల్ లీకై ఉండొచ్చు అని ఇంకొందరు అన్నారు.మంటలు ఎక్కడ మొదలయ్యాయి కూడా తెలియడం లేదు అని ఒకరు పేర్కొన్నారు.

<path d="M556.869,30.41 C554.814,30.41 553.148,32.076 553.148,34.131 C553.148,36.186 554.814,37.852 556.869,37.852 C558.924,37.852 560.59,36.186 560.59,34.131 C560.59,32.076 558.924,30.41 556.869,30.41 M541,60.657 C535.114,60.657 530.342,55.887 530.342,50 C530.342,44.114 535.114,39.342 541,39.342 C546.887,39.342 551.658,44.114 551.658,50 C551.658,55.887 546.887,60.657 541,60.657 M541,33.886 C532.1,33.886 524.886,41.1 524.886,50 C524.886,58.899 532.1,66.113 541,66.113 C549.9,66.113 557.115,58.899 557.115,50 C557.115,41.1 549.9,33.886 541,33.886 M565.378,62.101 C565.244,65.022 564.756,66.606 564.346,67.663 C563.803,69.06 563.154,70.057 562.106,71.106 C561.058,72.155 560.06,72.803 558.662,73.347 C557.607,73.757 556.021,74.244 553.102,74.378 C549.944,74.521 548.997,74.552 541,74.552 C533.003,74.552 532.056,74.521 528.898,74.378 C525.979,74.244 524.393,73.757 523.338,73.347 C521.94,72.803 520.942,72.155 519.894,71.106 C518.846,70.057 518.197,69.06 517.654,67.663 C517.244,66.606 516.755,65.022 516.623,62.101 C516.479,58.943 516.448,57.996 516.448,50 C516.448,42.003 516.479,41.056 516.623,37.899 C516.755,34.978 517.244,33.391 517.654,32.338 C518.197,30.938 518.846,29.942 519.894,28.894 C520.942,27.846 521.94,27.196 523.338,26.654 C524.393,26.244 525.979,25.756 528.898,25.623 C532.057,25.479 533.004,25.448 541,25.448 C548.997,25.448 549.943,25.479 553.102,25.623 C556.021,25.756 557.607,26.244 558.662,26.654 C560.06,27.196 561.058,27.846 562.106,28.894 C563.154,29.942 563.803,30.938 564.346,32.338 C564.756,33.391 565.244,34.978 565.378,37.899 C565.522,41.056 565.552,42.003 565.552,50 C565.552,57.996 565.522,58.943 565.378,62.101 M570.82,37.631 C570.674,34.438 570.167,32.258 569.425,30.349 C568.659,28.377 567.633,26.702 565.965,25.035 C564.297,23.368 562.623,22.342 560.652,21.575 C558.743,20.834 556.562,20.326 553.369,20.18 C550.169,20.033 549.148,20 541,20 C532.853,20 531.831,20.033 528.631,20.18 C525.438,20.326 523.257,20.834 521.349,21.575 C519.376,22.342 517.703,23.368 516.035,25.035 C514.368,26.702 513.342,28.377 512.574,30.349 C511.834,32.258 511.326,34.438 511.181,37.631 C511.035,40.831 511,41.851 511,50 C511,58.147 511.035,59.17 511.181,62.369 C511.326,65.562 511.834,…
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube