మూవీ రిలీజైన వారానికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న కృష్ణమ్మ.. ఇలా చేయడం రైటేనా?

ప్రస్తుతం అన్ని సినిమా ఇండస్ట్రీలలో సరైన సినిమాలు లేక వాతావరణం మొత్తం డల్ గా ఉంది.దానికి తోడు నిన్న మొన్నటి వరకు ఎక్కడ చూసినా కూడా ఎలక్షన్ల వాతావరణమే కనిపించడంతో చాలా వరకు సినిమాలను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ధైర్యం చూపలేకపోయారు.

 Shocker Satyadev Krishnamma Is Now In Ott Is This Reason, Sathyadev, Krishnamma,-TeluguStop.com

అయినప్పటికీ కొన్ని కొన్ని చిన్న సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి.అందులో కొన్ని పర్వాలేదు అనిపించుకుంటున్న, మరికొన్ని ప్లాప్ గా నిలుస్తున్నాయి.

ఇకపోతే గత వారపు శుక్రవారం రిలీజ్ కి వచ్చిన చిత్రం కృష్ణమ్మ( Krishnamma ).నటుడు సత్యదేవ్ హీరోగా దర్శకుడు వివి గోపాలకృష్ణ( VV Gopalakrishna ) ఈ మూవీని తెరకెక్కించారు.మరి ఒక రస్టిక్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం కేవలం ఈ వారం వ్యవధిలోనే ఓటిటిలో వచ్చి అభిమానులకూ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.నేటి నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటిటి యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కి వచ్చేసింది.

అయితే దీనికి కారణం చాలా మందికి అంతు పట్టడం లేదు.ఇదే విషయం గురించి సోషల్ మీడియాలో చర్చలు కూడా నడుస్తున్నాయి.

అయితే ఇందుకు గల కారణం థియేట్రికల్ గా బ్రేక్ ఈవెన్ అందుకోవడమే అని తెలుస్తోంది.ఈ వారం లోనే సినిమా బ్రేక్ ఈవెన్ కొట్టేసినట్టుగా వార్తలు వచ్చాయి.అందుకే ఇక ఓటిటి నుంచి వచ్చే ఆ కొద్ది మొత్తం కూడా నిర్మాతలకి ప్లస్ అవుతుంది అని వారం లోనే రిలీజ్ కి ఇచ్చేసారు.మరి ఈ సినిమాని చూడాలి అనుకునేవారు ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube