బ్యాంకు ఖాతాలో ఒక్క రాత్రిలోనే జీవితాన్ని మార్చేయగల భారీ మొత్తం డబ్బు వచ్చి చేరితే ఆ అనుభవం ఎలా ఉంటుంది? ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోతాయి కదూ.దక్షిణాఫ్రికాలోని ఓ యూనివర్సిటీ విద్యార్థినికి ఇదే జరిగింది.32 సంవత్సరాల వయసున్న ఆ విద్యార్థిని, చదువుకు అయ్యే బియ్యం, కూరల ఖర్చులకు సహాయంగా ప్రభుత్వం నుంచి ప్రతి నెలా కొద్దిపాటి డబ్బు, దాదాపు 100 (సుమారు రూ.8,300) పొందుతోంది.
కానీ, ఒకరోజు, ఆ సహాయ కార్యక్రమం చేసిన పెద్ద పొరపాటు వల్ల, అనుకోని రీతిగా బ్యాంకు ఖాతాలో భారీ మొత్తం డబ్బు అంటే 14 మిలియన్ రాండ్లు(14 million rands)(దాదాపు లేదా సుమారు రూ.6 కోట్లు) జమ అయ్యాయి.కానీ ఆ తప్పుని బ్యాంకుకు తెలియజేయకుండా, ఆ విద్యార్థిని ఆ డబ్బును ఖర్చు చేయడం మొదలుపెట్టింది.డిజైనర్ బట్టలు, లేటెస్ట్ ఐఫోన్, ఖరీదైన మద్యాన్ని కొనుగోలు చేసింది.
అంతేకాకుండా, పెద్ద పెద్ద పార్టీలు చేసి, స్నేహితులకు కానుకలు కూడా ఇచ్చింది.అనుకోకుండా వచ్చిన ఆ డబ్బులో దాదాపు 40,000 (సుమారు ₹33.3 లక్షలు) డాలర్లు ఖర్చు చేసింది.
ఆమె ఒక సూపర్ మార్కెట్ లో ఒక బ్యాంకు రశీదును పొరపాటున వదిలేసింది.ఇదే ఆమెను పట్టించడానికి కీలకమైన ఆధారమైంది.సూపర్ మార్కెట్ ఆమె గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.కట్ చేస్తే పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి, దొంగతనం, మోసం నేరాల(Theft, fraud crimes) కింద కేసు నమోదు చేశారు.2017లో ఈ సంఘటన జరిగింది.ఐదు సంవత్సరాల తర్వాత, 2022లో, ఆమెకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించారు.
అయితే, ఆమె న్యాయవాది ఆమె సమాజానికి ముప్పు కాదని, ఆ డబ్బును సంపాదించడానికి ఆమె ఎలాంటి ప్రయత్నం చేయలేదని వాదించారు.విద్యార్థిని స్వయంగా ఆ డబ్బు తనకు దేవుని దయ అని నమ్మిందని, అందుకే దానిని ఖర్చు చేయడానికి సంకోచించలేదని చెప్పింది.
2023లో, ఇద్దరు న్యాయవాదులు ఆమె దొంగతనం లేదా మోసం చేయలేదని ఆమె అకౌంట్లో అవి అనుకోకుండా వచ్చి పడ్డాయని ఇంత దానికి ఆమె ఎలా బాధ్యురాలు అవుతుందని వాదించారు.దాంతో జడ్జిలు జైలు శిక్షను రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు.14 వారాల పాటు సామాజిక సేవ చేయాలని, కౌన్సెలింగ్ తీసుకోవాలని వారు ఆమెకు ఆదేశించారు.ఆసక్తికరంగా, ఖర్చు చేసిన డబ్బును తిరిగి చెల్లించాలని వారు ఆమెను ఆదేశించలేదు.ఈమె స్టోరీ గురించి తెలుసుకొని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.