మెగా బ్రదర్ నాగబాబు( Nagababu ) ఇటీవల అల్లు అర్జున్( Allu Arjun ) ని ఉద్దేశించి చేసినటువంటి ట్వీట్ సంచలనగా మారిన సంగతి తెలిసిందే.అల్లు అర్జున్ ప్రచార కార్యక్రమాలలో భాగంగా వైసీపీ అభ్యర్థి శిల్ప రవికి( Silpa Ravi ) మద్దతుగా నంద్యాలలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే దీంతో నాగబాబు అల్లు అర్జున్ పరోక్షంగా చేసినటువంటి ట్వీట్ సంచలనగా మారింది.
మాతో ఉంటూ ప్రత్యర్థుల కోసం పనిచేసేవాడు మావాడు అయిన పరాయి వాడే.మా పక్కన ఉంటూ ఇతరుల కోసం పనిచేసేవాడు మా వాడే అంటూ ఒక పోస్ట్ చేశారు.
అల్లు అర్జున్ పేరు ప్రస్తావనకు తీసుకురాకుండా నాగబాబు ఈ విధమైన పోస్ట్ చేయడంతో తప్పనిసరిగా ఈ పోస్ట్ అల్లు అర్జున్ ను ఉద్దేశించి చేశారని అందరూ భావించారు.దీంతో అల్లు అర్జున్ అభిమానులు( Allu Arjun Fans ) సోషల్ మీడియా వేదికగా నాగబాబు పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.అల్లు రామలింగయ్య లేకపోతే చిరంజీవి( Chiranjeevi ) ఉండేవారు కాదు మీరు కూడా ఉండేవారు కాదు అంటూ చాలామంది ట్రోల్ చేశారు.
ఇలా సోషల్ మీడియాలో ఆయన గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ దెబ్బకు నాగబాబు ఏకంగా ట్విట్టర్ డీ యాక్టివేట్ చేశారు.అయితే నాగబాబు తిరిగి ట్విట్టర్ లో యాక్టివ్ అవుతూ మరో పోస్ట్ చేసారు.నేను నా ట్వీట్ ను డిలీట్ చేశాను అంటూ మరో పోస్ట్ చేసారు.
ఇలా నాగబాబు ఈ ట్వీట్ డిలీట్ చేయడంతో నాగబాబు బన్నీ విషయంలో తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే అంటూ పలువురు ఈ ట్వీట్ పై కామెంట్స్ చేస్తున్నారు.మరి నాగ బాబు ఈ ట్వీట్ చేయడంతో ఈ వివాదం ముగిసినట్టేనా లేదంటే ఇలాగే కోల్డ్ వార్ కంటిన్యూ అవుతుందా అనే విషయం తెలియాల్సి ఉంది.