భారత్‌లోని ఆ ప్రాంతంలో తిరుగుతూ కెమెరాకి చిక్కిన యూఎఫ్ఓ?

ఈ విశ్వంలో గ్రహాంతర వాసులు ఉన్నాయా లేవా అనేది ఎప్పటినుండో ఒక మిస్టరీ లాగా మిగిలిపోయింది.వీటి గురించి డైలీ చర్చ జరుగుతూనే ఉంటుంది.

 A Ufo Caught On Camera Roaming In That Part Of India, Unidentified Flying Objec-TeluguStop.com

అంతేకాదు వీటికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.జంగా వాటికి సంబంధించినవి కాకపోయినా ఈ వీడియోలో గ్రహాంతరవాసుల ఉనికి కనిపిస్తుంది అంటూ కొంతమంది షేర్ చేస్తుంటారు అవి చాలామందిని ఆకట్టుకుంటాయి.

ఏలియన్స్ ఉన్నాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు ఇప్పటివరకు దొరకలేదు.

అమెరికా( America ) నుంచి ఏలియన్స్ ఉన్నాయని చూపించే వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా అప్‌లోడ్ అవుతుంటాయి.కానీ తాజాగా దీనికి విరుద్ధంగా భారతదేశంలోని జైపూర్‌( Jaipur ) నుంచి కొత్త ఏలియన్ వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అయ్యింది.

మే 4, జైపూర్‌లో ఈ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ ( UFO ) పంపించిందంటూ ఈ వీడియోను షేర్ చేశారు.ఓ భవనం నుండి తీసిన ఆ ఫుటేజ్‌లో మేఘాల మధ్య ఎగురుతున్న ఓ వింత వస్తువు కనిపించింది.

అది మనకు తెలిసిన బర్డ్స్ లేదా విమానం లాంటిది ఏమీ కాదు.ఆ వస్తువు మేఘాలు కారణంగా కొన్నిసార్లు కనిపించి, కొన్నిసార్లు మాయమవుతూ చివరికి పూర్తిగా కనిపించకుండా పోయింది.

ఈ వీడియో సోషల్ మీడియా( Social media) లో చాలా చర్చకు దారి తీసింది.ఈ వీడియోలో నిజంగా ఏం కనిపించిందో ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు.

ఈ వీడియోను ఒక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా షేర్ చేసింది.“UFO”ని చూపించే ఆ వీడియోకు లక్షలాది వ్యూస్, 70,000కు పైగా లైక్స్‌ వచ్చాయి.వీడియో క్యాప్షన్‌లో ఏం అనిపిస్తుందో చెప్పాలంటూ అడిగారు.వీడియో చూసిన వారి అభిప్రాయాలు చాలా భిన్నంగా ఉన్నాయి.కొందరు అది నిజంగానే UFO అని నమ్ముతారు, మరికొందరు వీడియో ఫేక్ అని కొట్టిపారేశారు.ఒక వ్యక్తి ఏలియన్స్ ఆహారం కోసం భారతదేశానికి వచ్చాయని జోక్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube