ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి తిధి రోజున మహాశివరాత్రి పండుగను ప్రజలందరూ ఎంతో ఘనంగా, వైభవంగా జరుపుకుంటారు.ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి 18వ తేదీన శనివారం వస్తోంది.
ఈ రోజున శివుడు జ్యోతిర్లింగ రూపంలో దర్శనం ఇస్తాడు.మహాశివరాత్రి రోజు శని ప్రదోష సర్వసిద్ధి వంటి అనేక మహాయోగాలు జరగడం ఈ రోజుకి మరింత విశిష్టతను చేకూరింది.
మానవ సంక్షేమం కోసం అనేక పరిహారాలు శివపురాణంలో తెలిపారు.ఈ పరిహారాలు చేయడం వల్ల ఆ శివుని అపారమైన అనుగ్రహాన్ని పొంది రుణ విముక్తి పొందవచ్చు.
భౌతిక యుగంలో కొన్నిసార్లు జీవిత అవసరాలను తీర్చుకోవడానికి అప్పులు చేయవలసిన పరిస్థితి వస్తూనే ఉంటుంది.కానీ కొన్ని పరిస్థితులు కారణంగా రుణాన్ని తిరిగి చెల్లించడం కష్టమవుతుంది.
శివపురాణంలో రుణ విముక్తి కోసం కొన్ని నివారణలో తెలియజేశారు.మహాశివరాత్రి రోజు ఈ నివారాలను చేస్తే భోజనాథ్ ఆశీర్వాదంతో రుణ విముక్తి, ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి.
శివపురాణంలోని పరిష్కారాలను ఇప్పుడు తెలుసుకుందాం.శివపురాణం ప్రకారం మహాశివరాత్రి రోజు శివాలయానికి వెళ్లి నువ్వులను నెయ్యిలో ముంచాలి.
ఆతరువాత ‘ఓం నమః శివాయ‘ అనే మంత్రాన్ని జపిస్తూ శివలింగానికి నెయ్యి కలిపిన నువ్వులను ఒక్కొక్కటిగా సమర్పించండి.ఇలా చేయడం వల్ల మీరు ఆర్థిక సమస్యలను దూరం చేసుకుంటారు.ఇంకా చెప్పాలంటే మహాశివరాత్రి శనివారం రోజు జరుపుకుంటారు కాబట్టి బిల్వపత్ర చెట్టు కింద పేదలకు, బ్రాహ్మణులకు భోజనం పెట్టండి.
ఇలా చేయడం వల్ల ధనం పొందే అవకాశం ఎక్కువగా ఉంది. శివుడి అనుగ్రహంతో మీరు రుణ విముక్తులు అవుతారు.అలాగే ఇలా చేయడం వల్ల శివశక్తి అనుగ్రహం కూడా లభిస్తుంది.
ఇంకా చెప్పాలంటే ఆర్థిక సమస్యల నుంచి దూరం అవ్వాలంటే మహాశివరాత్రి రోజున శివలింగానికి చెరుకు రసం తో అభిషేకం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందుతారు.
LATEST NEWS - TELUGU