హిందూ ధర్మంలో( Hindu Dharma ) ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి.ముఖ్యంగా వాటిలో నుదుటిపై తిలకం పెట్టుకోవడం.
చాలామంది హిందువులు నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టుకుంటారు.స్త్రీ, పురుషులు ఇద్దరు కూడా తిలకాన్ని పెట్టుకుంటారు.
మనం దేవాలయం లో వెళ్ళినప్పుడు, ఇంట్లో పూజ, యాగం, హోమం ఇలా అన్నిటికీ ముఖ్యంగా మనం తిలకం పెట్టుకుంటాం.అయితే ఇది భారత దేశంలో పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది.
పూర్వకాలంలో ఏదైనా శుభకార్యం చేసే ముందు బొట్టు పెట్టుకునేవారు ఆ కాలంలో లో రాజులు కూడా మొదట తమ నుదుటిపై తిలకాన్ని దిద్దుకున్న తర్వాతే యుద్ధానికి బయలుదేరుతారు.దీంతో తమ పూజించిన దేవతను స్మరించుకుంటారు.

అయితే నుదుటిపై తిలకాన్ని పూయడం యొక్క ప్రాముఖ్యతను హిందూ పురాణాలలో ఎంతో వివరంగా చెప్పడం జరిగింది.దీని గురించి హిందూ ప్రాముఖ్యత మాత్రమే కాకుండా, శాస్త్రవేత్తలు( Scientists ) కూడా దాని ప్రాముఖ్యతను అంగీకరించడం ప్రారంభించారు.తిలకం పెట్టుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.అయితే నుదుటిపై తిలకం పెట్టుకోవడం వలన కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మన శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి.ఈ చక్రాలలో ఒకటి నుదుటి మధ్యలో ఉన్న ఆజ్ఞా చక్రం( AJNA CHAKRA ) తిలకం ఎప్పుడూ ఆజ్ఞా చక్రం పై ఉంచాలి.
చాలామంది ఉంగరపు వేలితో తిలకం దిద్దుతారు.బొట్టు పెట్టుకుంటే జ్ఞానం పెరుగుతుందని నమ్మకం.
అదే సమయంలో ఏదైనా పనిలో విజయం సాధించడానికి చూపుడు వేలితో తిలకం పెట్టుకోవాలి.

పురాణాలలో తిలకం భగవంతునిపై విశ్వాసానికి చిహ్నంగా పరిగణించబడుతుంది అని అందరూ నమ్ముతారు.ఇక భారతదేశం విషయానికొస్తే గంధం, గోపీచందన్, సింధూరం, కుంకుమ, రోలీ, భస్మ, అష్టగంధం, గులాల్ లాంటి అనేక రకాల తిలకాలు ఉన్నాయి.ఈ విధంగా తరచూ నుదుటిపై తిలకం దిద్దుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలతో పాటు జీవితంలో అదృష్టం కూడా వస్తుంది.
అంతేకాకుండా ముఖ్యంగా చూపుడువేలు బొటనవేలు ఉపయోగించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి
.