శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని అల్మాస్ గూడ సి వై ఆర్ కాలనీ (CYR) అధ్యక్షుడు కృష్ణారెడ్డి,సెక్రటరీ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు.మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు.

 Minister Sabita Indrareddy Attending The Installation Ceremony Of The Sri Krishn-TeluguStop.com

మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్టాపన తో పాటు దుర్గామాత అమ్మవారు,శివ పార్వతుల విగ్రహాలు కూడా ప్రతిష్టాపన చేయడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.మొదటి రోజు గణపతి పూజతో మొదలు చివరిరోజు పూర్ణాహుతితో కార్యక్రమాలు ముగిశాయి అని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి,కార్పొరేటర్లు, కార్పొరేషన్ అధ్యక్షుడు,ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube