మనదేశంలోని ప్రజలందరూ ఏ పండుగనైనా ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులందరికీ పాటు జరుపుకుంటారు.మనదేశంలో జరుపుకునే ప్రతి పండుగ కు కచ్చితంగా ఒక చరిత్ర అనేది ఉంటుంది.
అలాగే ప్రతి సంవత్సరం దీపావళి ముందు రోజు వచ్చే నరక చతుర్దశి నీ చాలామంది జరుపుకుంటారు.నరక చతుర్దశి రోజు కూడా కొన్ని పద్ధతులనూ,ఆచారాలనూ పాటించాల్సి వస్తుంది.
చాలామంది మన దేశంలోని ప్రజలకు నరక చతుర్దశి వెనుక ఉన్న అసలు కధ ఎవరికీ తెలియదు.అసలు నిజానికి నరక చతుర్దశి వెనుక చాలా పెద్ద కథే ఉంది.
నరక చతుర్దశి తర్వాత వచ్చే రోజున దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ అంగరంగ వైభవంగా తమ ఇంట్లో దీపాలను వెలిగించి ఎంతో సంతోషంగా దీపావళి పండుగను జరుపుకుంటారు.
ఎలా అయితే చాలామంది ప్రజలు దీపావళి పండుగను జరుపుకుంటారు అట్లాగే నరక చతుర్దశి ని కూడా జరుపుకుంటారు.
పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే శ్రీ మహా విష్ణువు వరాహ అవతారాన్ని దర్శించినప్పుడు భూదేవికి శ్రీమహావిష్ణువు జన్మించినవాడు నరకాసురుడు.అయితే నరకాసురుడు ఓసారి తపస్సు చేస్తున్నప్పుడు, ఆ తపస్సుకు మెచ్చిన శివుడు తల్లి చేతిలో తప్ప ఇంక ఎవరి చేతిలో మరణం లేదనే విధంగా వరాన్ని ఇస్తాడు.
అప్పటినుంచి నరకాసురుడు దేవతలను, మనుషులను ఎన్నో రకాల బాధలు పెడుతూ ఉంటాడు.భూదేవినీ కూడా నరకాసురుడు ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తాడు.
చివరకు నరకాసురుడు రాజు కూడా అవుతాడు.నరకం లాంటి ఒక రాజధాని కూడా ఏర్పాటు చేసి ప్రజలను హింసించడం ఇంకా పెంచేస్తాడు.శ్రీకృష్ణుడు నరకాసురుడు చేస్తున్నా అఘాయిత్యాలను చూడలేక శ్రీకృష్ణుడు నరకాసురుడి పై యుద్ధాన్ని ప్రకటిస్తాడు.సత్యభామగా భూదేవి జన్మించి శ్రీ మహా విష్ణువు కృష్ణుడుగా సత్యభామ తో పాటు ఇద్దరు కలిసి దానికి వెళ్తారు.
ఇద్దరు కలిసి యుద్ధానికి వచ్చారని ఎగతాళి చేసిన నరకాసురుడిని సత్యభామ చంపేస్తుంది.నరక చతుర్దశి నాడు నరకాసురుడి బాధలన్నీ తొలగిపోయాయని ప్రజలు ఎంతో సంతోషించి దీపావళి పండుగను చేసుకుంటారు.