ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కాంతార సినిమా పేరు మారుమోగిపోతుంది.కన్నడ భాషలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీ విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమాని అన్ని భాషలలో విడుదల చేశారు.
ప్రస్తుతం ఈ సినిమా తెలుగు తమిళ హిందీ భాషలలో విడుదలై బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సినిమానీ తెలుగులో అరవింద్ సమర్పణలో విడుదల చేశారు.
ఇక తెలుగులో కూడా ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తుంది.రెండు కోట్ల రూపాయలకు ఈ సినిమా తెలుగు హక్కులను కొనుగోలు చేసిన అల్లు అరవింద్ కు ఇప్పటికే ఏకంగా ఐదారు కోట్ల రూపాయల వరకు లాభం వచ్చినట్లు సమాచారం.
ప్రస్తుత కాలంలో ఏదైనా ఒక హిట్ సినిమా వస్తే తప్పకుండా ఆ సినిమాకు సీక్వెల్ చిత్రం రావడం సర్వసాధారణం.ఈ క్రమంలోనే కాంతార వంటి బ్లాక్ బస్టర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం ఉంటుందా అనే విషయం గురించి అభిమానులలో పెద్ద ఎత్తున సందేహం నెలకొంది.
అయితే తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్నటువంటి హీరో రిషబ్ శెట్టి ఈ సినిమా సీక్వెల్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సినిమాలో నటుడిగా రిషబ్ శెట్టి నటించడమే కాకుండా ఆయన దర్శకత్వంలోని ఈ సినిమా తెరకెక్కింది.నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ గురించి వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే ఈ విషయంపై రిషబ్ శెట్టి స్పందిస్తూ ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ ఫ్రీక్వెల్ గురించి తాను ఏమాత్రం ఆలోచించడం లేదని, ప్రస్తుతం తనకు ఓ రెండు నెలల పాటు విశ్రాంతి తప్పకుండా అవసరం.
రెండు నెలల తర్వాత ఈ సినిమా సీక్వెల్ గురించి ఆలోచిస్తానంటూ ఈయన సమాధానం చెప్పారు.ఈ విధంగా రిషబ్ శెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.