గురువారం రోజు సాయిబాబాకు ఎంతో ఇష్టమైన రోజు అని పండితులు చెబుతున్నారు.ఆయనను భక్తితో పూజిస్తే వెంటనే మీ కోరికలు తీరిపోతాయని చెబుతున్నారు.
అయితే గురువారం రోజున ఈ విధంగా సాయిబాబా ను పూజించడం వల్ల మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.మరి గురువారం రోజున బాబాను ఏ విధంగా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గురువారం రోజున సాయి బాబా దేవాలయానికి వెళ్లి సాయి బాబాకు పూజలు నిర్వహించడంతో పాటు గురువారం ఉపవాసం ఉండి భక్తితో పూజిస్తే ఎంతో మంచిది.గురువారం రోజు ఉదయం నిద్ర లేచి తలస్నానం చేయాలి.
ఉపవాసం( Fasting ) ఉండి భక్తితో సాయిబాబాను పూజించడం వల్ల మీరు కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి.

19 గురువారాలు ఉపవాసం ఉండి బాబాకు ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల మీరు ఏది కోరుకుంటే అది వెంటనే నెరవేరుతుంది.గురువారం రోజు ( Thursday )ఉదయాన్నే నిద్ర లేచి తల స్నానం చేసి బాబాను ధ్యానించాలి.సాయి బాబాకు</em( Sai Baba Pooja ) పసుపు రంగు దుస్తులు అంటే ఎంతో ఇష్టం.
కాబట్టి పసుపు రంగు ధరించి ఉపవాసం చేస్తే విగ్రహాన్ని గంగాజలంతో శుభ్రం చేసి దాని పై పసుపు రంగు వస్త్రాన్ని ఉంచాలి.అలాగే ప్రసాదంగా లడ్డూ లేదా పాలతో తయారు చేసిన వాటిని నైవేద్యంగా సమర్పించి వాటిని అందరికీ పంచి పెట్టాలి.
భక్తితో ఒక ఐదుగురు పేదలకు అన్నదానం చేయడం కూడా ఎంతో మంచిది.

సాయి బాబాకు ఎంతో ఇష్టమైన వ్రతాన్ని ఇలా తొమ్మిది రోజుల పాటు చేస్తే ఉపవాసం ఉండాలి.తొమ్మిదవ రోజు పూజ చేసేటప్పుడు ఏమైనా తప్పులు జరిగితే క్షమించమని ఆయనను భక్తితో వేడుకోవాలి.చిన్న పిల్లలను ఇంటికి పిలిచి ఆ ప్రసాదాన్ని వారికి పెట్టడం వల్ల బాబా ఎంతో ఆనందం కలిగి మీరు కోరుకున్న కోరికలను నెరవేరుస్తారు.
అయితే రోజుల్లో ఒక్కసారి మాత్రమే భోజనం చేయాలి.ఇలా కఠినమైన పూజ చేయడం వల్ల బాబా మీ కోరికలు వెంటనే తీరుస్తారు.ఈ పూజ చేసే ముందు చాలా నిష్టతో చేయాలని పండితులు ( Scholars )చెబుతున్నారు.