సాధారణంగా చాలా మంది ప్రజలు తమ జీవితంలోని రహస్యలను ఇతరులతో పంచుకుంటూ ఉంటారు.ఇలా చేయడం వల్ల చాలా మందికి మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.
అలాగే ఇలాంటి రహస్యలను చాలా మంది ప్రజలు వారు ఎక్కువగా నమ్మిన వారికే చెబుతూ ఉంటారు.ఎంతటి స్నేహితులైన ప్రాణ మిత్రులైన కొన్ని విషయాలను అస్సలు చెప్పకూడదు.
కొన్ని మన వ్యక్తిగత విషయాలు స్నేహితులకు, బంధువులకు చెబితే ఆ విషయాలతో వారు మనల్ని బ్లాక్ మెయిల్ చేసే వరకు వెళ్ళవచ్చు.కాబట్టి కొన్ని విషయాలను రహస్యంగా ఉంచడమే మంచిది.
మరి ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
జీవితంలో మన వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వల్ల మన ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపుతుంది.
ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని విషయాలను రహస్యంగా ఉంచడం వల్ల భావోద్వేగాలపై నియంత్రణ వస్తుంది.రహస్యంగా ఉంచాల్సిన కొన్ని విషయాలను ఇతరులతో పంచుకోవడం వల్ల అనవసరమైన ఒత్తిడి, ఆందోళనలను ( Stress , anxiety )ఎదుర్కోవాల్సి వస్తుంది.
భార్యాభర్తల మధ్య మాత్రమే ఉండాల్సిన విషయాలను వేరే వారితో అస్సలు పంచుకోకూడదు.మన విషయాలు తెలుసుకునే బ్లాక్ మెయిల్ కూడా చేయవచ్చు.

అలాగే ఆర్థిక వివరాలను ఎవరితోనూ పంచుకోవడం మంచిది కాదు.మన పొదుపు, అప్పులు ( Savings , loans ) వంటి ఆర్థిక పరమైన విషయాలను ఇతరులకు చెప్పకూడదు.అలాగే ఆదాయం, ఖర్చులు లాంటి విషయాలు మన సంకేతిక మధ్యమాల డేటాను ఇతరులకు చెప్పకపోవడం మంచిది.ఇతరులకు ఈ విషయాలు తెలిస్తే దొంగలించడం, సైబర్ మోసాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది.
అలాగే మన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను కూడా ఎవరితో చెప్పకూడదు.

ముఖ్యంగా చెప్పాలంటే సోషల్ మీడియా లో జీవితాలను ఇతరులతో పోల్చుకొని ఉచ్చులో పడడం చాలా సులభంగా మారిపోయింది.వ్యక్తిగత జీవితాలను గోప్యంగా ఉంచుకున్నప్పుడు టెంప్టేషన్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.జీవితంలో ఎక్కువ సమాచారాన్ని పంచుకోవడం వల్ల అపార్థాలకు, తప్పుడు ఆలోచనలకు దారి తీస్తుంది.
అలాగే మీ ప్రియమైన వారి విషయాలను కూడా ఇతరులతో చెప్పకూడదు.