హిందూమతంలో దేవశయని ఏకాదశికి ( Devashayani Ekadashi )చాలా ప్రత్యేకత ఉంది.ఆషాడ మాసంలోని ఏకాదశిని దేవశయని ఏకాదశి అని అంటారు.
ఈ కాలంలో లో మహా విష్ణువు( Lord Vishnu ) నిద్రలోకి జారుకుంటారు.అలాగే నాలుగు నెలల పాటు ఆయన నిద్రలోనే ఉంటారని నమ్ముతారు.
అందుకే హిందువులు ఈ కాలాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు.శ్రీమహావిష్ణువు నిద్రలోకి జారుకున్న రోజు నుండి చతుర్మాసం ప్రారంభమవుతుంది.
ఇక ఈ చతుర్మాసానికి చాలా విశిష్టత ఉంటుంది.ఇక దేవశయని ఏకాదశి పండుగ జూన్ 29వ తేదీన రానుంది.
ఈరోజు విష్ణువు నిద్రకు ఉపక్రమిస్తాడు.
అయితే ఆ రోజున తులసికి ( Basil )సంబంధించి కొన్ని తప్పులు చేయకూడదని చెబుతున్నారు.ఆ తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.లక్ష్మీ స్వరూపంగా భావించే తులసి మాత దేవశయని ఏకాదశి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తుంది.
అందుకే తులసి మొక్క విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.పొరపాటున కూడా తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు.
దేవశయని ఏకాదశి రోజున తల్లి తులసి విష్ణువు కోసం నీరు కూడా ముట్టకుండా ఉపవాసం ఆచరిస్తుంది.కాబట్టి పొరపాటున కూడా ఆ మొక్కకు నీటిని పోయకూడదు.
అంతేకాకుండా దేవశయని ఏకాదశి రోజున తులసి ఆకులను తుంచకూడదు.ఒకవేళ ఏకాదశి రోజున తులసి దళాలతో విష్ణువును పూజించాలి అని భావించేవారు ఒకరోజు ముందే తులసి ఆకులను తుంచి పెట్టుకోవాలి.అంతేకానీ ఏకాదశినాడు మాత్రం తుంచితే లక్ష్మీదేవికి( Goddess Lakshmi ) ఆగ్రహం వస్తుంది.దేవశయని ఏకాదశి రోజున తులసి చెట్టు చుట్టూ పరిశుభ్రంగా ఉంచాలి.పొరపాటున కూడా పాదరక్షలు ధరించి తులసి చెట్టు వద్దకు వెళ్లకూడదు.ఇక దేవశయని ఏకాదశి రోజున తులసి చెట్టుకు దూరంగా ఉండాలి.
ఆ రోజున తులసి మొక్కను అస్సలు తాగకూడదు.