బుగ్గ రామలింగేశ్వర ఆలయ ప్రత్యేకతలు ఏమిటో మీకు తెలుసా..?

మనదేశంలో వివిధ ప్రాంతాలలో మనకు ఆ పరమేశ్వరుని క్షేత్రాలు దర్శనమిస్తున్నాయి.ఒక్కో ఆలయంలో ఒక్కో పేరుతో కొలువై ఉన్న పరమేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తూ వారి కోరికలను నెరవేరుస్తున్నాడు.

 Bugga Ramalineswara Temple, Tadipatri, Tretayugam, Penna Rever, Bugga Ramalingas-TeluguStop.com

అదేవిధంగా మనదేశంలో ఎన్నో శివ ఆలయాలున్నప్పటికీ ఒక్కో ఆలయానికి ఓ ప్రత్యేకతను చాటుకున్నాయి.ఇలాంటి ప్రత్యేకత చెందిన ఆలయాలలో ఒకటిగా పేరుగాంచినది బుగ్గ రామలింగేశ్వర ఆలయం.

ఈ ఆలయంలో వెలసిన శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది.అంతటి ప్రత్యేకత కలిగిన ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం.

అనంతపురం జిల్లా తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర ఆలయం ఎంతో మహిమాన్వితమైన ఆలయంగా చెప్పవచ్చు.పెన్నా నది తీరంలో త్రేతాయుగంలో సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడి చేత ప్రతిష్టింపబడినది కావడంతో ఇక్కడ కొలువై ఉన్న స్వామివారిని రామలింగేశ్వరునిగా పూజిస్తారు.

బ్రాహ్మణుడైన రావణాసురుడిని చంపడం వల్ల వచ్చిన పాపం నుంచి విముక్తి పొందడం కోసం శ్రీరామచంద్రుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి.ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని విజయనగర రాజులు ఎంతో అద్భుతంగా నిర్మించారు.

రామాచారి అని శిల్పకారుడు దాదాపు 650 మంది శిల్పులతో కొన్ని సంవత్సరాల పాటు ఈ ఆలయాన్ని నిర్మించారని అక్కడి శాసనాలు చెబుతున్నాయి.

Telugu Penna Rever, Tadipatri, Tretayugam-Telugu Bhakthi

ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఏడాదిలో 365 రోజులు గర్భగుడిలో కొలువై ఉన్న స్వామివారి లింగం కింద నుంచి జలధార ఊరుతూనే ఉంటుంది.బుగ్గ అనగా నీటి ఊట.వర్షాలు లేకపోయినా వేసవి కాలం అయినా, నీటివనరులు ఎండిపోయిన ఈ ఆలయంలో శివలింగం కింద నుంచి మాత్రం నీరు ఊరుతూనే ఉంటుంది.ఈ విధంగా స్వామివారి లింగం నుంచి నీటి బుగ్గ ఏర్పడటంవల్ల ఈ ఆలయానికి బుగ్గ రామలింగేశ్వరుడు అనే పేరు వచ్చింది.ఇప్పటికీ ఆ నీటి బుగ్గ రహస్యం ఏమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు.

ఈ ఆలయం మొత్తం నల్లటి రాతితో నిర్మించడం మరొక ప్రత్యేకత.ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘ మాస బహుళ అష్టమి మొదలుకొని ఫాల్గుణ మాసం శుద్ధ తదియ వరకు అనగా 11 రోజుల పాటు స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం ఎంతో మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube