బుగ్గ రామలింగేశ్వర ఆలయ ప్రత్యేకతలు ఏమిటో మీకు తెలుసా..?

మనదేశంలో వివిధ ప్రాంతాలలో మనకు ఆ పరమేశ్వరుని క్షేత్రాలు దర్శనమిస్తున్నాయి.ఒక్కో ఆలయంలో ఒక్కో పేరుతో కొలువై ఉన్న పరమేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తూ వారి కోరికలను నెరవేరుస్తున్నాడు.

అదేవిధంగా మనదేశంలో ఎన్నో శివ ఆలయాలున్నప్పటికీ ఒక్కో ఆలయానికి ఓ ప్రత్యేకతను చాటుకున్నాయి.

ఇలాంటి ప్రత్యేకత చెందిన ఆలయాలలో ఒకటిగా పేరుగాంచినది బుగ్గ రామలింగేశ్వర ఆలయం.ఈ ఆలయంలో వెలసిన శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది.

అంతటి ప్రత్యేకత కలిగిన ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం.అనంతపురం జిల్లా తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర ఆలయం ఎంతో మహిమాన్వితమైన ఆలయంగా చెప్పవచ్చు.

పెన్నా నది తీరంలో త్రేతాయుగంలో సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడి చేత ప్రతిష్టింపబడినది కావడంతో ఇక్కడ కొలువై ఉన్న స్వామివారిని రామలింగేశ్వరునిగా పూజిస్తారు.

బ్రాహ్మణుడైన రావణాసురుడిని చంపడం వల్ల వచ్చిన పాపం నుంచి విముక్తి పొందడం కోసం శ్రీరామచంద్రుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి.

ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని విజయనగర రాజులు ఎంతో అద్భుతంగా నిర్మించారు.

రామాచారి అని శిల్పకారుడు దాదాపు 650 మంది శిల్పులతో కొన్ని సంవత్సరాల పాటు ఈ ఆలయాన్ని నిర్మించారని అక్కడి శాసనాలు చెబుతున్నాయి.

"""/"/ ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఏడాదిలో 365 రోజులు గర్భగుడిలో కొలువై ఉన్న స్వామివారి లింగం కింద నుంచి జలధార ఊరుతూనే ఉంటుంది.

బుగ్గ అనగా నీటి ఊట.వర్షాలు లేకపోయినా వేసవి కాలం అయినా, నీటివనరులు ఎండిపోయిన ఈ ఆలయంలో శివలింగం కింద నుంచి మాత్రం నీరు ఊరుతూనే ఉంటుంది.

ఈ విధంగా స్వామివారి లింగం నుంచి నీటి బుగ్గ ఏర్పడటంవల్ల ఈ ఆలయానికి బుగ్గ రామలింగేశ్వరుడు అనే పేరు వచ్చింది.

ఇప్పటికీ ఆ నీటి బుగ్గ రహస్యం ఏమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు.ఈ ఆలయం మొత్తం నల్లటి రాతితో నిర్మించడం మరొక ప్రత్యేకత.

ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘ మాస బహుళ అష్టమి మొదలుకొని ఫాల్గుణ మాసం శుద్ధ తదియ వరకు అనగా 11 రోజుల పాటు స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం ఎంతో మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.

Chandrababu : కదిరి ప్రజాగళం సభలో చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!