నాలుగు రోజుల పాటు సాగే నాగోబా జాతరలో అసలేం చేస్తారు?

నాలుగు రోజుల పాటు సాగే నాగోబా జాతరలో ఏం చేస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.వృత్తుల ఆధారంగా మెస్రం వంశీయులు 7 శాఖలుగా చీలిపోయారు.

 What Is Actually Done At The Four Days Of Nagoba Jathara, Nagoba Jathara,  Four-TeluguStop.com

అందులోని కటోడా దివాకర్, ఘాడియా సంకేపాయిలర్ వాడే శాఖల వారు కేస్లాపూర్ జాతరకు 16 రోజుల ముందు పవిత్ర గోదావరి జలం తీసుకొచ్చేందుకు బయలుదేరుతారు.కాలికి చెప్పులు లేకుండా అడవి దారిలో నాగు పాముల్లా వంకలు తిరగుతూ… మెస్రం వంశీయులు గంగాజలం తీసుకొచ్చేందుకు వెళ్తారు.

ఇదే వంశంలోని మిగితా శాఖల వారు కూడా వారి వెంట వెళతారు.వీరందరికీ ముందుగా పరధాన తెగ, వాయిద్య గోండ్రు వాయిస్తూ ఉంటే వెనక నుంచి గిరిజనులు వెళుతుంటారు.

కేస్లాపూర్‌కు సుమారు వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న కలమడుగు మండలం సమీపాన ఉన్న గోదావరి నదీ నుంచి కలశంలో గంగా జలం తీసుకొని వస్తారు.ఈ పవిత్ర జలంతో… కేస్లాపూర్‌ చేరుకొని ఆలయ ప్రాంగణంలోని మర్రిచెట్టు కింద విడిది చేస్తారు.

అమవాస్య రోజు రాత్రి నాగోబాకు కొత్త కుండల్లో గోదావరి నుంచి తెచ్చిన నీళ్లతో అభిషేకం చేస్తారు.తరువాతే క్షీరాభిషేకం చేసి గిరిజన ఆచారాల మేరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

అంతే కాదండోయ్ యాత్రలో ముందుకు సాగుతున్న మెస్రం వంశస్థులు అతిథ్యం ఇచ్చిన కుటుంబాల ఆడపడుచులకు కానుకలు ఇవ్వడం కూడా సంప్రదాయంలో భాగమే.యాత్రలో మొత్తం తొమ్మిది గ్రామాల్లో బస చేస్తున్న వీరంతా తిరుగుపయనం అయ్యేటపుడు ఆడపడుచులకు తోచిన కానుకలు ఇస్తూ ముందుకు కదులుతున్నారు.3 సంవత్స రాలకొకసారి పూజారిని మార్చడం ఆనవాయితీ.

Interesting Facts about Nagoba Jathara Nagoba Jathara

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube