Vastu Shastra : రాత్రిపూట చెట్లను పట్టుకోవడం వల్ల అనర్ధాలు వస్తాయా..

మన దేశ వ్యాప్తంగా చాలామంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు.కొన్ని నిర్దిష్టమైన సమయాలలో కొన్ని పనులను మాత్రం అస్సలు చేయకూడదని కూడా వాస్తు శాస్త్రం చెబుతోంది.

 Does Holding Trees At Night Cause Harm , Vastu Shastra, Night Cause Harm, Vastu,-TeluguStop.com

ఎందుకంటే ప్రకృతికి విరుద్ధమైన పనులను చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.అవేమిటంటే వాస్తుకు విరుద్ధంగా ఇంట్లో సామాన్లను సర్దుకోవడం, వాస్తు విరుద్ధంగా ఇంట్లోనే వస్తువులను ఎలా పడితే అలా ఉంచడం వల్ల ఇంట్లోని కుటుంబ సభ్యుల ఆదాయం తగ్గిపోయి, ఆర్థిక సమస్యలు వ్యాపార నష్టాలు వచ్చే అవకాశం ఉంది.

అయితే చెట్లకు సంబంధించిన వాస్తు పండితులు చెట్ల గురించి కొన్ని నమ్మలేని నిజాలను చెబుతున్నారు.ఎందుకంటే చెట్లు మనుషులకు ఎప్పుడు లాభం చేకూరుస్తూనే ఉంటాయని చాలామంది నమ్ముతారు.

కానీ కొన్ని సమయాలలో చెట్లు ప్రజలకు హాని కూడా కలిగించే అవకాశం ఉంది అని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇలాంటి తప్పులను చెట్ల విషయంలో చేస్తే మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.వాస్తు శాస్త్రం ప్రకారం చెట్లు కానీ మొక్కలను కానీ ముట్టుకోకూడదని చెబుతున్నారు.

Telugu Carbon, Vastu Shastra, Scientific, Vastu, Vastu Tips-Telugu Bhakthi

ఎందుకంటే వేదాలలో, పురాణాలలో చెట్లను కానీ, మొక్కలను కానీ మనుషుల లాగే భావించాలని ఉంది.అయితే మొక్కలు మరియు చెట్లు కూడా రాత్రి నిద్రపోతాయని వాటిని ముట్టుకోవడం వల్ల మహా పాపమని వేద పండితులు చెబుతున్నారు.అలాగే రాత్రి పూట చెట్ల ఆకులను కొయ్యడం, తెంపడం లాంటి పనులు కూడా అస్సలు చేయకూడదు.ఎందుకంటే సైంటిఫిక్ గా చూసుకున్న రాత్రి పూట చెట్లు లేదా మొక్కలు అయినా కార్బన్ డై ఆక్సైడ్ ను విడిచి పెడుతూ ఉంటాయి.

ఇది మనుషులకు హాని చేస్తుంది.కాబట్టి రాత్రి పూట చెట్లని మొక్కలను అనవసరంగా ముట్టుకొని ఇబ్బందులు పడకూడదు అని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube