హిందూ సంప్రదాయంలో ప్రతి పూజ కూడా మొదటిగా గణపతి( Ganesha )కే చేస్తారు.అలాగే వినాయకుడి పూజలో ఎన్నో రకరకాల మోదకాలను సమర్పిస్తారు.
అంతేకాకుండా వీటితోపాటు కుంకుమ, అక్షతలు, దర్భలు, పువ్వులు, సుగంధ ద్రవ్యాలు, సింధూరం ఇలాంటివన్నీటిని గణేషుడి పూజలో ఉపయోగిస్తారు.అయితే తులసి( Holy Basil )ని మాత్రం గణేశ పూజకు అస్సలు ఉపయోగించకూడదు.
అయితే తులసిని అసలు ఎందుకు ఉపయోగించరో పురాణాల్లో ఉన్న పురాణాలు ఏం చెబుతున్నాయి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక సమయంలో వినాయకుడు గంగా నది( River Ganga ) ఒడ్డున తపస్సు చేస్తూ ఉంటారు.
ఆ సమయంలో ధర్మాత్మ జోడి కుమార్తె తులసి తన వివాహ కోరిక ఫలించాలని తీర్థయాత్రలో ఉంటుంది.అలాగే ఎన్నో తీర్థయాత్రలు చేసుకుంటూ అందులో భాగంగా గంగా నది తీరానికి వస్తుంది.
అయితే గంగా తీరంలో గణపతి తపస్సులో ఉండడాన్ని గమనిస్తుంది.అప్పుడు ఆయన రత్నఖచిత సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు.
అతడి శరీరం సుగంధ ద్రవాళా లేపనంతో మెడలో పారిజాతాల మాలతో అనేక అందమైన బంగారు రత్నహారలతో అలంకరించబడి ఉంటుంది.

అయితే తులసీదేవి అతడి అందమైన రూపానికి ఆకర్షితురాలు అవుతుంది.ఇక ఆమెకు గణేశుని వివాహమాడాలని కోరిక మనసులో కలుగుతుంది.మనసులోని ఆ కోరిక వల్ల అతడికి తపోభంగం అయింది.
తులసి వల్ల తనకు తపోభంగం జరిగిందని తెలుసుకొని, తులసికి తాను బ్రహ్మచారిని ఆమె కోరికను తిరస్కరించాడు గణేశుడు.అయితే ఆ తిరస్కరానికి తులసి దేవికి కోపం వచ్చింది.
దీంతో దీర్ఘకాలం పాటు బ్రహ్మచారిగా ఉండిపోమని గణేషుడిని శపిస్తుంది.ఆ కారణంగానే శాపానికి లోనైనా వినాయకుడు కోపం వచ్చి తులసిని అసురుడిని భర్తగా పొందుతావని అలాగే అతడి చెరలో ఉండిపోతామని శపిస్తాడు.

ఇది విన్న తులసి గణేశుని క్షమించమని వేడుకుంటుంది.ఇలా గణేశా శాపం వల్ల తులసికి చంకచూచడనే రాక్షసుడితో వివాహం జరుగుతుంది.అతడు అందరిని కూడా బాధిస్తూ ఉంటాడు.తులసి పాతివ్రత్యం వల్ల అతడిని సంహరించడం విష్ణుమూర్తికి మాత్రమే సాధ్యమవుతుంది.అయితే వినాయకుడి సహాయంతో ఆమె పాతివ్రత్యాన్ని భంగం వాటిల్లెల చేసి ఆ రాక్షసుడిని విష్ణుమూర్తి సంహరిస్తాడు.

విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల తులసి దేవి తులసి మొక్కగా అవతరిస్తుంది.అయితే తన పాతివ్రత్య భంగానికి వినాయకుడు కారణమని తెలుసుకుని శిరస్సు లేకుండా జీవించమని తులసి గణేషుడిని శపిస్తుంది.ఇది తెలుసుకున్న గణపతి తులసి సాన్నిహిత్యాన్ని తను సహించబోరని ప్రకటిస్తాడు.అందుకే గణేష పూజలో తులసి నిషిద్ధం.కాబట్టి గణేష పూజలో తులసిను అస్సలు ఉపయోగించరు.
DEVOTIONAL







