ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ట్రెండ్ నడుస్తూ ఉంది.మనకు ఏది కావాలనుకున్న ఇంట్లో ఉన్న చోటు నుంచే స్మార్ట్ ఫోన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు.
అనేక కొత్త యాప్ లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.అయితే ఇప్పటి వరకు ఫుడ్, వస్తువులు, గిఫ్టులు చివరకు ఆవు మూత్రం ఆవు పేడను కూడా ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తూ ఉన్నాము.
అయితే బైద్యనాథ్ దేవాలయనికి(Baidyanath temple) ప్రతిరోజు వేలాదిగా భక్తులు వస్తూ ఉంటారు.శివుడికి అభిషేకం కూడా చేస్తూ ఉంటారు.
ఈ నీరు వేస్ట్ గా పోకుండా తిరిగి భక్తులకు చేరే విధంగా అక్కడి అధికారులు విన్నుతంగా చర్యలు చేపట్టారు.జార్ఖండ్(Jharkhand) రాష్ట్రంలోని ప్రసిద్ధ బైద్యనాథ్ దేవాలయం ఉంది.
ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.ఈ క్రమంలో ప్రతిరోజు ఇక్కడికి లక్షలాదిగా భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటారు.
అంతేకాకుండా శివుడికి అభిషేకం చేయడానికి భక్తులు క్యూ కడుతూ ఉంటారు.అయితే అక్కడి మున్సిపాల్ అధికారులు విన్నతంగా ఆలోచించారు.
అభిషేకం చేసిన నీరు వృధాగా పోకుండా రీసైక్లింగ్ చేయడానికి ప్లాంట్ ను నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ప్రాథమికంగా నీళ్లను ఒక ట్యాంక్ మాదిరిగా నిర్మించి నీటిని ఫిల్టర్ చేస్తున్నారు.అంతేకాకుండా దేవాలయాలు, రైల్వే, బస్ స్టేషన్ లో వీటిని విక్రయించే పనులు మొదలుపెట్టారు.ఇదిలా ఉండగా ఈ ప్లాంట్ తయారీకి దాదాపు 50 లక్షలు అయిందని సమాచారం.
ఏప్రిల్ నాటికి ఈ ప్లాంట్ పూర్తిగా భక్తులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.ప్లాంట్ మేనేజర్ అమిత్ సూర్యకుమార్(Plant Manager Amit Suryakumar) మీడియాతో మాట్లాడుతూ 22 దేవాలయాలలో అందించే నీటిని పైపు ద్వారా ఈ ప్లాన్ కు తీసుకొస్తున్నాము అని వెల్లడించారు.
ఎందుకంటే బిల్వపత్ర ఆకులు సహా అనేక పదార్థాలు ఆ నీటిలో ఉంటాయి.ఆ పదార్థాలను వేరు చేసి ఫిల్టర్ చేస్తారు.తర్వాత ఆ నీటిని ఆన్ లైన్ లో అమ్ముతారు.ఇది ఏప్రిల్ నెలలో పూర్తిస్థాయిలో మొదలవుతుంది అని తెలిపారు.
DEVOTIONAL