కాజల్ పెళ్లి.. ఆచార్య లొల్లి!

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తాజాగా పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.అక్టోబర్ 30గౌతమ్ కిచ్లుని వివాహమాడేందుకు కాజల్ పాప రెడీ అయ్యింది.

 Acharya To Rethink On Kajal Aggarwal, Acharya, Chiranjeevi, Kajal Aggarwal, Kaja-TeluguStop.com

కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న ఈ బ్యూటీ, ఇలా పెళ్లి ముచ్చట చెప్పడంతో ఆమె ఓకే చేసిన చిత్ర యూనిట్ సభ్యులు ఆందోలనకు గురవుతున్నారు.ముఖ్యంగా తెలుగులో కాజల్ అగర్వాల్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.అయితే ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఇప్పుడు కాజల్ పెళ్లి చేసుకుంటుండటంతో ఈ చిత్ర యూనిట్ డైలమాలో పడింది.

ఇప్పుడు పెళ్లి తరువాత కాజల్ ఈ సినిమాలో వెంటనే జాయిన్ అవుతుందో లేదో అనే సందేహం వారిలో నెలకొంది.దీంతో కాజల్ స్థానాన్ని వేరే హీరోయిన్‌తో భర్తీ చేయాలా అనే ఆలోచనలో చిత్ర యూనిట్ పడిందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

అయితే పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటించడం ఖాయమని కాజల్ ఇప్పటికే వెల్లడించింది.దీంతో ఆచార్య చిత్ర యూనిట్‌కు కాస్త ఊరట లభించింది.

దీంతో ఈ సినిమాలో వేరే హీరోయిన్‌ను తీసుకోవాల్సిన అవసరం లేదని చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.కాగా ఈ సినిమాలో చిరు సరికొత్త అవతారంలో మనకు కనిపిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ కేమియో పాత్రలో కనిపించనున్నాడు.

ఇక ఈ సినిమాను చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube