టి పీసీసీ అధ్యక్షుడిగా వెంకటరెడ్డి ? మరి రేవంత్ పరిస్థితి ?

చాలా కాలంగా తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త రధసారధిని నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్నా, ఎప్పటికప్పుడు అది వాయిదా పడుతూనే వస్తోంది.

దీనికి కారణం ఎవరిని అధ్యక్షుడిగా ఎంపిక చేసినా, మిగిలినవారిలో తీవ్ర అసంతృప్తి నెలకొంటుందని, అది పార్టీకి చేటు తీసుకువస్తుంది అనే ఉద్దేశంతో అధిష్టానం వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చింది.

అయితే ఈ పదవికి రేవంత్ రెడ్డి మాత్రమే సమర్ధుడు అని , ఆయన మాత్రమే పార్టీని అధికారం వైపు నడిపించగలడు అనే వ్యాఖ్యలు వినిపించాయి.ఇక అధిష్టానం కూడా ఆయన వైపు మొగ్గు చూపుతూ వచ్చింది.

కాకపోతే ఆయనకు పిసిసి అధ్యక్ష పదవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వొద్దు అంటూ పార్టీ సీనియర్ లు అధిష్టానంపై ఒత్తిడి తీసుకు రావడం వంటి వ్యవహారాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి.ఇదిలా ఉంటే దుబ్బాక ఉపఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చతికిల బడటంతో దానికి బాధ్యత వహిస్తూ టీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో, కొత్త అధ్యక్షుడు నియామకానికి కసరత్తు మొదలు పెట్టారు.

రెండు రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ కొత్త పిసిసి అధ్యక్షుడు ఎంపికపై పూర్తిగా దృష్టి సారించి, నేతలతో సమావేశం నిర్వహిస్తూ వస్తున్నారు.తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిసిసి అధ్యక్ష పదవి తనకే ఇవ్వాలని కోరుతూ మాణిక్యం ఠాకూర్ తో భేటీ అవ్వడం చర్చనీయాంశం అయింది.

Advertisement

గంటపాటు జరిగిన ఈ చర్చల్లో వెంకట్ రెడ్డి తనకు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకు వెళతాను అనే విషయంపై నా, తనకున్న ప్రణాళికల ను సమగ్రంగా వివరించినట్లు తెలుస్తోంది.నాయకుల నుంచి తీసుకున్న అభిప్రాయాలు, వినతులపైనా శనివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలకు  నివేదిక ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే అధిష్టానం నిర్ణయం వెలువడక ముందే తెలంగాణ పి సి సి అధ్యక్షుడిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియమితులు కాబోతున్నారు అంటూ హడావుడి మొదలైపోయింది.

కానీ ఈ వ్యవహారాలు రేవంత్ వర్గీయులలో అసహనం రేకెత్తిస్తున్నాయి.ఒకవేళ అధిష్టానం కోమటిరెడ్డి వైపు మొగ్గు చూపితే, రేవంత్ కాంగ్రెస్ లో ఉన్నా సరే, ఆయనకు కలిసి వచ్చేది ఏమీ ఉండదని, ఇప్పటికే ఆయనకు బిజెపి నుంచి ఆఫర్లు, ఒత్తిళ్లు వస్తున్నా , కాంగ్రెస్ లోనే ఉంటూ, కాంగ్రెస్ ను అధికారం వైపు నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారు అని, ఆయనకు కనుక పీసీసీ అధ్యక్ష పదవి రాకపోతే బీజేపీలోకి వెళ్లేందుకు సైతం వేనకాడబోరు అనే విషయాన్ని రేవంత్ అనుచరులు హైలెట్ చేస్తున్నారు.

కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు