కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీలో రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది.ఈ క్రమంలో శుక్రవారం వైసీపీ అధినేత సీఎం జగన్( CM Jagan ) కడపలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

 Cm Jagan Sensational Comments On Cm Revanth Reddy During Kadapa Election Campaig-TeluguStop.com

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

( CM Revanth Reddy ) చంద్రబాబు మనిషి అని షాకింగ్ కామెంట్స్ చేశారు.నా తండ్రి వైయస్ 2009లో మరణించాక ఏ రకంగా కుటుంబాన్ని కాంగ్రెస్( Congress ) ఇబ్బందులకు గురిచేసిందో అందరికీ తెలుసు.

ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఎలక్షన్ సమయంలో నాన్న సమాధి దగ్గరికి వస్తారట.కాంగ్రెస్ పార్టీకి వైయస్ నీ అభిమానించే వాళ్ళు.

ఏనాడో సమాధి కట్టారు.

కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఓట్లు చీలిపోతాయి.తద్వారా ఎన్డీఏకి లాభం చేకూరుతుంది.చంద్రబాబుని( Chandrababu ) గెలిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఏపీలో పని చేస్తుందని ఆరోపించారు.

చంద్రబాబు పగలు బీజేపీతో రాత్రి కాంగ్రెస్ పార్టీతో కాపురం చేస్తారు.నాన్నగారు ఎవరితో అయితే యుద్ధం చేశారో.

వారితో కలిసి వైఎస్ఆర్ వారసులం అని చెబుతున్నవారు కలిసి పనిచేస్తున్నారు.ఓట్లు చీల్చి చంద్రబాబును గెలిపించడానికి తెగ తాపత్రయ పడుతున్నారు.

రాజకీయాలు ఎంతగానో దిగజారిపోయాయి.ఎంపీ అవినాష్ జీవితం నాశనం చేసేందుకు చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ కుట్ర చేస్తోంది అని కడపలో సీఎం జగన్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube