ఎవరు సపోర్ట్ లేకుండా కింద నుంచి పైకి వచ్చిన హీరో చిరంజీవి.( Chiranjeevi ) తనదైన స్టైల్ తో, మనేరిజం తో టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.
మొదటినుంచి ఆయన తీస్తున్న సినిమాల వల్లే అంచలంచేలుగా ఎదుగుతూ వచ్చాడు.ఆయన లాంటి ఒక వ్యక్తి మరొకరు ఉండరు.
అందుకు ఉదాహరణ ఆయన సాధించిన అవార్డులు, రివార్డులు ఆయన చేసిన చిత్రాలు, అవి సాధించిన విజయాలు.ఒక మామూలు నటుడు మెగాస్టార్ గా( Megastar ) మారిన విధానాన్ని చూసి ఎంతోమంది ఆదర్శంగా తీసుకుని సినిమా ఇండస్ట్రీకి వచ్చారు.
వారు కూడా స్టార్ హీరోలుగా ఎదిగారు.అందుకే చిరంజీవిని చూసి మేము నేర్చుకున్నాము, సినిమా ఇండస్ట్రీకి వచ్చాము అంటూ ఎన్నోసార్లు స్టేజీలపై చెబుతూ ఉంటారు.
ఈ సంగతి పక్కన పెడితే, చిరంజీవి సినిమాల పరంగా ఎక్కువగా విజయాన్ని అందుకున్నారు.అయితే కొన్నిసార్లు ప్రయోగాల జోలికి వెళ్లి బొక్క బోర్ల పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి.ఎందుకంటే చిరంజీవి విలన్స్ ని కొడితే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ విజిల్స్ వేస్తూ కాసుల వర్షం కురిపిస్తారు కానీ చిరంజీవిని ఎవరైనా కొడితే తట్టుకోలేరు.అందుకే ఆయన కూడా ఎప్పుడూ ఆడియన్స్ కి తగ్గట్టుగానే హీరోయిజం, ఫైటింగ్స్, మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలనే చేస్తూ వచ్చారు.
అలా చిరంజీవి ప్రయోగాలు చేసిన ప్రతిసారి చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు.ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆయన చేసిన కొన్ని సినిమాల గురించి తెలుసుకోవాలి.మృగరాజు( Mrugaraju Movie ) లాంటి ఒక సినిమా తీస్తే ఆడియన్స్ అస్సలు యాక్సెప్ట్ చేయలేదు.
ఇక సైరా నరసింహారెడ్డి( Syeraa Narasimha Reddy ) వంటి సినిమా తీస్తే కూడా ప్రేక్షకులు చిరంజీవిని రిజెక్ట్ చేశారు.ఇప్పుడు విశ్వంభర( Vishwambhara ) అనే కొత్త కాన్సెప్ట్ తో మరొక సినిమా తీస్తున్నారు దర్శకుడు విశిష్ట.ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు అయితే ఇది కూడా చిరంజీవి కెరియర్ లో ఒక ప్రయోగం అనే చెప్పాలి.
మరి ఈ ప్రయోగాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది అనేక అనుమానాలు వస్తున్నాయి.సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది.ఈ సినిమా విడుదలయితే కానీ ఈ చర్చకు ముగింపు దొరకదు.ఈ సినిమా ఒకవేళ విజయం సాధిస్తే చిరంజీవి ప్రయోగాలు చేస్తే విజయం పొందుతాడు అని అందరూ అనుకుంటారు లేదంటే ఇది వరకు చేసిన ప్రయోగాల మాదిరిగానే ఇది కూడా ఫ్లాప్ అయితే ఇకపై చిరంజీవి ప్రయోగాలు చేయడానికి ప్రేక్షకులు అసలు ఒప్పుకోరు.