నీలిరంగు చీరలో అదరహో అనిపిస్తున్న అనుపమ.. చీర ఖరీదెంతో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో ఒకరైన అనుపమ పరమేశ్వరన్ కు( Anupama Parameswaran ) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.టిల్లూ స్క్వేర్ సినిమాతో( Tillu Square ) అనుపమ పరమేశ్వరన్ కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దక్కింది.

 Anupama Blue Color Saree Pics Goes Viral In Social Media Details, Anupama, Anupa-TeluguStop.com

టాలీవుడ్ స్టార్ హీరోలకు జోడీగా నటించకపోయినా ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం కెరీర్ ను కొనసాగించిన హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు కావడం గమనార్హం.నీలిరంగు చీరలో అనుపమ అదరహో అనిపిస్తుండగా ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

అనుపమ పరమేశ్వరన్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.స్టార్ హీరోయిన్ అనుపమ ధరించిన చీర ఖరీదు ఏకంగా 15000 రూపాయలు అని తెలుస్తోంది.ఈ చీర సింపుల్ గా కనిపించినా ఈ చీర బనారస్ చీర( Banaras Saree ) అని సమాచారం అందుతోంది.మరోవైపు టిల్లూ స్క్వేర్ సక్సెస్ తో అనుపమ పరమేశ్వరన్ పారితోషికం డబుల్ అయిందని సమాచారం అందుతోంది.

గ్లామర్ రోల్స్ లో నటించడానికి కూడా ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని తెలుస్తోంది.

Telugu Anupama, Tillu Square-Movie

ప్రేమమ్ సినిమాతో( Premam ) కెరీర్ ను మొదలుపెట్టిన అనుపమ పరమేశ్వరన్ అప్పటినుంచి ఇప్పటివరకు కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదని తెలుస్తోంది.తెలుగుతో పాటు తమిళంలో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో క్రేజ్ ఉండటం ఈ బ్యూటీకి కలిసొస్తోంది.టాలీవుడ్ టైర్1 హీరోలు ఛాన్స్ ఇస్తే మాత్రం అనుపమ భవిష్యత్తుకు ఢోకా ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Anupama, Tillu Square-Movie

ఒక్కో సినిమాకు 2 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్న ఈ బ్యూటీ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే తన పారితోషికాన్ని మరింత పెంచే అవకాశాలు అయితే ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.భవిష్యత్తు సినిమాలతో అనుపమ కోరుకున్న సక్సెస్ దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.అనుపమను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube